Heart attack @ Winter | చలికాలంలో గుండెపోటు ప్రమాదం.. ఇలా నివారించుకోవచ్చు..!
Heart attack @ Winter | చలికాలంలో గుండె సంబంధ సమస్యలు మనల్ని వేధిస్తుంటాయి. చలి కారణంగా రక్తపోటు పెరిగి గుండెపోటుకు దారి తీసే అవకాశాలు ఉన్నాయి.
అందుకని చలికాలంలో కొన్ని టిప్స్ పాటించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.
Heart attack @ Winter | చలికాలంలో కొత్త కొత్త వ్యాధులు మనల్ని చుట్టుముడుతుంటాయి. చలి ఎక్కువైన పక్షంలో గుండెపై ఒత్తిడితో పాటు రక్తనాళాలు కుచించుకుపోవడం, రక్తపోటు పెరగడం, స్ట్రోక్ వంటి ఆరోగ్య సమస్యలు కూడా వస్తుంటాయి. ఇలా గుండెపై కలిగే ఒత్తిడి గుండెపోటుకు దారితీసే అవకాశాలుంటాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చలికాలంలో గుండెపోటు సర్వసాధారణంగా ఉంటుంది. మన జీవనశైలి కూడా గుండెపోటుతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంటాయి.
చలికాలంలో తరచుగా, తీవ్రంగా గుండెపోటు ఉంటుదని అమెరికా పరిశోధకుల పరిశోధనలో తేలింది. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ జర్నల్‌లో ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం, డిసెంబర్ 25-జనవరి 5 మధ్య గుండె జబ్బుటకు సంబంధించిన మరణాల రేటు ఎక్కువగా పెరుగుతుంది. ఇలాంటి గుండె సంబంధ సమస్యలు రాకుండా ఉండాలంటే చలికాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపై అవాగాహన కలిగి ఉండాలి.
గుండె పోటు ఎందుకు పెరుగుతుంది..
చల్లని వాతావరణంలో సిరలు మరింత కుచించుకుపోతాయి. అలాగే గట్టిపడిపోతాయి. ఇది సిరలను వేడెక్కించేందుకు, సక్రియం చేసేందుకు రక్తప్రవాహాన్ని పెంచుతుంది. రక్తప్రసరణ పెరగడం వల్ల రక్తపోటు వచ్చి గుండె పోటు ప్రమాదాన్ని కలిగిస్తుంది. ఇప్పటికే గుండె సంబంధ సమస్యలున్నవారికి చలికాలం మరింత ప్రాణాంతకంగా మారుతుంది.
ఎలా జాగ్రత్తపడాలి..
పండ్లు, కూరగాయల్లో పుష్కలంగా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. చలికాలంలో వీటిని అధిక మొత్తంలో తినడం ద్వారా రక్తపోటు పెరగకుండా చూసుకోవచ్చు. మరీ ముఖ్యంగా క్యారెట్, బచ్చలికూర, బీట్‌రూట్, దానిమ్మ, టమాట, ద్రాక్షల్లో పెద్ద మొత్తంలో యాటీ ఆక్సిడెంట్లు ఉండి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
వ్యాయామాలు చేయాలా..
తేలికపాటి వ్యాయామాలు లేదా ఏదైనా శారీరక శ్రమను జోడించాలి. ఇలా చేయడం వల్ల శరీరక, మానసిక ఆరోగ్యం రెండూ చెక్కుచెదరకుండా ఉంటాయి. యోగా, ధ్యానం, రన్నింగ్, సైక్లింగ్ లేదా మరేదైనా తేలికపాటి వ్యాయామాన్ని ఎంచుకోవాలి. వీటి కారణంగా గుండె ఆరోగ్యంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు.
జీవనశైలి మార్చుకోవాలా..
మన శరీరం సక్రమంగా పనిచేయాలంటే మన మంచి జీవనశైలి, మంచి దినచర్యలను అనుసరించడం చాలా ముఖ్యం. సమయానికి నిద్ర పోవడం, సమయానికి భోజనం చేయడం, ఇల్లు, బయట కాస్తాంతైనా ఒళ్లు వంచే పని చేయాలి.
మద్యం, సిగరెట్ అలవాట్లు..
చల్లని వాతావరణంలో మద్యం సేవించడం, సిగరెట్ స్మోకింగ్ చేయడం వల్ల గుండెపై అధిక దుష్ప్రభావాలు ఉంటాయి. మన గుండె ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాహారాలు తీసుకోవడంతోపాటు మద్యం, సిగరెట్ స్మోకింగ్ అలవాట్లను పక్కనపెట్టాలి.
ఒమేగా-3 తీసుకోవడం..
గుండె ఆరోగ్యానికి ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ వినియోగం చాలా మంచిది. ఇది కీళ్లనొప్పులు, గుండె గట్టిదనం, రక్తపోటు కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంచుతుంది. కనీసం వారానికి ఒకసారైనా ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ లభించే చేపలను తింటుండాలి.
ఎక్కువగా నీరు తాగడం..
చల్లటి వాతావరణంలో నీరు తాగడం చాలా వరకు తగ్గిపోతుంది. అందుకని మంచి ఆహారంతోపాటు సరైన మొత్తంలో నీరు తాగుతుండాలి. ముఖ్యంగా గుండె సంబంధ సమస్యలను దూరం చేసుకునేదుకు శరీరం సరైన రీతిలో హైడ్రేషన్ కలిగి ఉండాలి.
వెచ్చని దుస్తులు ధరించడం..
చలికాలంలో చలి నుంచి కాపాడుకునేందుకు ఎక్కువగా వెచ్చటి దుస్తులు ధరించేలా చూసుకోవలి. చల్లని గాలితో నేరుగా సంబంధం లేకుండా చూసుకోవాలి. తల, చెవులను కవర్ చేస్తూ కర్చీప్ కట్టుకోవాలి. చల్లని గాలి ఉన్న సందర్భాల్లో బయటకు వెళ్లకుండా చూసుకోవడం ఉత్తమం.
0 Comments:
Post a Comment