Health Tips - రక్తనాళాల్లో అనవసర కొవ్వును తొలగించే ఇంటి చిట్కాలు..
జీర్ణ క్రియ అనేది మన శరీరంలో చాలా ముఖ్యమైన భాగం. జీర్ణక్రియ పక్రియ అనేది సక్రమంగా జరిగితేనే మనిషి మనుగడ సక్రమంగా ఉంటుంది. జీర్ణ వ్యవస్థ మాదిరిగా రక్త ప్రసరణ వ్యవస్థ కూడా మానవ శరీరంలో చాలా ముఖ్యమైనది. రక్త నాళాల ద్వారా రక్త ప్రసరణ జరుగుతుంది. రక్త ప్రసరణకు ఏ చిన్న అడ్డు వచ్చినా కూడా గుండె వద్ద సమస్య మొదలు అవుతుంది. అందుకే రక్త నాళాలు సక్రమంగా పని చేస్తే విధంగా చూసుకోవాలి అంటూ వైధ్యులు సలహాలు ఇస్తారు. ఆహారపు అలవాట్లు మరియు ఇతర కారణాల వల్ల రక్త నాళాలు పూడుకు పోతూ ఉంటాయి. ప్రధానంగా రక్త నాళాల్లో ఎక్కువగా కొవ్వు పేరుకు పోతుంది.
రక్త ప్రసరణ అడ్డుకుంటూ ఉండే వ్యర్థ పదార్థాలను ఏ ఆపరేషన్ నో లేదా మరేదో చికిత్స వల్ల కంటే కూడా మన ఇంటి చిట్కాలు వాడి చాలా ఈజీగా రక్త నాళాలను శుభ్రం చేయవచ్చు.
రక్త నాళాల్లో ఉన్న వ్యర్ద పదార్థాలకు ముఖ్యంగా గ్రీన్ టీ అద్బుత ఔషదంగా పని చేస్తుంది. గ్రీన్ టీ లో ఉన్న గుణాల కారణంగా రక్తనాళాల్లో ఉన్న కొవ్వు అనేది ఈజీగా కరిగి పోతుంది. గ్రీన్ టీ ని ఎక్కువగా తాగే వారు బరువు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. కొవ్వు తగ్గించేందుకు గ్రీన్ టీ అన్ని విధాలుగా ఉయోగదాయకం. గ్రీన్ టీ రెగ్యులర్ గా తాగే వారిలో గుండె పోటు అవకాశం దాదాపుగా 70 శాతం తక్కువ అంటూ నిపుణులు చెబుతున్నారు.
శరీరంలోని వ్యర్థాలను ఆలివ్ ఆయుల్ తొలగిస్తుందనే అభిప్రాయంను నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ప్రయోగాల్లో కూడా రక్త నాళాల్లో ఉన్న వ్యర్థాలను ఆలివ్ ఆయుల్ తొలగిస్తుందని నిర్థారణ అయ్యింది. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఆలివ్ ఆయుల్ ను రెగ్యులర్ గా వాడాలి. పాలకూరలో ఉండే లక్షణాల కారణంగా రక్త నాళాల వ్యర్థాలను క్లీన్ చేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పసుపు మరియు అల్లంలో కూడా ఉండే గుణాల కారణంగా రక్త నాళాలను శుభ్రం చేస్తాయి. కనుక ప్రతి రోజు ఆహారంలోకి పసుపు మరియు అల్లం ఉండేలా చూసుకోవాలంటూ పెద్దలు చెబుతూ ఉంటారు. ఇక రోజుకో యాపిల్ వల్ల కూడా రక్త ప్రసరణ బాగా జరుగుతోంది. రక్త నాళాలు క్లీన్ చేసేందుకు డాక్టర్లు మందులు కూడా ఇస్తారు. కాని ఇప్పటి వరకు చెప్పుకున్న పద్దతిలో ప్రయత్నిస్తే మాత్రం తప్పకుండా ప్రయోజనాలు ఉంటాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.
0 Comments:
Post a Comment