health tips: అద్భుతమైన వంటింటి మెడిసిన్.. పసుపుతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు!!
ప్రతి ఒక్కరి వంట గదిలో కచ్చితంగా ఉండేది పసుపు. పసుపు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను చేకూర్చే అద్భుతమైన వంటింటి మెడిసిన్ అంటే కచ్చితంగా నమ్మి తీరాల్సిందే
పసుపు యాంటీబయాటిక్ గానే కాకుండా యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలతోనూ మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది.
వేడి పాలలో పసుపు వేసుకుని తాగితే ఆ అనారోగ్య సమస్యలు మాయం
ఇక పసుపు తో కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుంటే, పసుపును వాడకుండా ఉండలేరు. చిటికెడు పసుపుతో కలిగే బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇక్కడ తెలుసుకుందాం. పసుపు.. మంచి యాంటీబయాటిక్. మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో పసుపు ఎంతగానో ఉపయోగపడుతుంది, సహజంగా జలుబు, దగ్గు, ఒళ్ళు నొప్పులు తదితర సమస్యలకు వేడిపాలలో కాస్త పసుపు వేసుకుని తాగమని పెద్దలు చెబుతూ ఉంటారు. అలా చేస్తే జలుబు, దగ్గు, ఒళ్ళు నొప్పులు వంటి అనారోగ్య సమస్యల నుండి పసుపు మనకు కాస్త ఉపశమనం ఇస్తుంది.
పసుపుతో క్యాన్సర్ కణాల పెరుగుదలకు చెక్
పసుపు ను వాడటం వల్ల కీళ్ళ నొప్పులు, కీళ్ళ వాపులు తగ్గుతాయి. పసుపు ఉండే యాంటీబయోటిక్ లక్షణాలు వల్ల ఏదైనా దెబ్బతగిలినప్పుడు గాయాలను త్వరగా నయం చేయడానికి పసుపును వాడతారు. ఇప్పటికీ మనకు ఏదైనా దెబ్బ తగిలితే అక్కడ పసుపు పెట్టటం ఇప్పటికీ చూస్తున్నాం . ఇక అంతే కాదు పసుపు క్యాన్సర్ కణాల పెరుగుదలను, అభివృద్దిని నిరోధిస్తుంది.
అల్జీమర్స్ కు, అలర్జీల నివారణకు పసుపు బెస్ట్
పసుపులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు వల్ల వాపు, దురద, దద్దుర్ల బారినపడకుండా ఇది కాపాడుతుంది. పసుపులో ఉండే కర్క్యుమిన్ ను ఔషధాల తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇది మెదడు పనితీరును, జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. అంతేకాదు అల్జీమర్స్ తో బాధపడే వాళ్ళు పసుపును ఎక్కువగా వాడడం వల్ల మంచి ఫలితం ఉంటుందని చాలా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఇక గుండె నాళాలు, గోడలకు కలిగే నష్టాన్ని తగ్గించడంలో పసుపు ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఎన్నో ఆయుర్వేద గుణాలు ఉన్న పసుపును నిత్యం మితంగా తీసుకోవాలి
పళ్ళు, చిగుళ్ళ సమస్యలను తగ్గించడంలోనూ పసుపు ఉపయోగపడుతుంది. ఎన్నో ఆయుర్వేద గుణాలు ఉన్న పసుపును ప్రతిరోజు పరిమిత మోతాదులో తీసుకోవడం వల్ల మనకు ఆరోగ్య ప్రయోజనం కలుగుతుంది. అజీర్తి, గుండెల్లో మంట కు, డయాబెటిస్ కు, డిప్రెషన్ సమస్యకు అల్జీమర్స్ కు పసుపును ఉపయోగించడం ఎంతో మంచిది. పసుపు ప్రతిరోజు ఉపయోగించినప్పటికీ దానిని మితంగానే ఉపయోగించాలని చెబుతున్నారు. అతిగా పసుపును ఉపయోగిస్తే అది కూడా ఆరోగ్యానికి హాని చేస్తుందని సూచిస్తున్నారు.
0 Comments:
Post a Comment