Health tips: డయాబెటిస్, బీపీతో పాటు వంద రోగాల ఉపశమనానికి అద్బుతమైన సింపుల్ చిట్కా!!
చాలామంది ఉదయాన్నే నిద్ర లేవగానే గోరువెచ్చగా ఉన్న నీళ్లను తాగాలని చెబుతారు. నిత్యం మన జీవితంలో గోరువెచ్చగా ఉన్న నీళ్లను తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని చెబుతారు.
డయాబెటిస్, బీపీతో పాటు వంద రోగాల ఉపశమనానికి అద్బుతమైన సింపుల్ చిట్కా ఇది. అయితే అసలు గోరువెచ్చని నీటిని తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి? గోరువెచ్చని నీళ్లను నిత్యం తాగడం వల్ల ఎన్ని నెలల్లో ఏఏ సమస్యల నుండి విముక్తి లభిస్తుంది? వంటి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.
గోరువెచ్చని నీళ్ళను తాగితే ఆరోగ్య ప్రయోజనాలు
గోరువెచ్చని నీటిని తాగడం వల్ల చాలా మంచి అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అయితే చాలామంది గోరువెచ్చని నీటిని కాకుండా, బాగా ఎక్కువ వేడిగా ఉన్న నీటిని తరచుగా తాగి ప్రయోజనాల కోసం చూస్తూ ఉంటారు. అది ఏమాత్రం మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. నీటిని ఎప్పుడూ గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే తాగాలి అని సూచిస్తున్నారు.
డయాబెటిస్ .. బీపీ ఎంత కాలంలో అదుపులోకి వస్తుందంటే
గోరువెచ్చని నీటిని తాగడం వల్ల కలిగే ప్రయోజనాల విషయానికి వస్తే ఖాళీ కడుపుతో ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ బయటకు వెళ్లిపోతాయి. ఇది శరీర అవయవాలకు కావల్సిన బూస్ట్ ఇస్తుంది. ప్రతిరోజు ఉదయం గోరువెచ్చని నీటిని తాగడం వల్ల డయాబెటిస్ కంట్రోల్ కానివారికి, 30 రోజుల్లో డయాబెటిస్ నియంత్రణలోకి వస్తుంది. ఇక బీపీ బాధితులకు కూడా 30 రోజులలో బీపీ అదుపులోకి వస్తుంది.
నరాలలో బ్లాక్స్ .. కడుపు, మూత్ర సంబంధిత సమస్యలకు చెక్
కడుపు సంబంధిత అనారోగ్య సమస్యలు ఉన్నవారికి నిత్యం గోరువెచ్చని నీటిని తాగడం వల్ల పది రోజుల్లో ఆ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. గోరువెచ్చని నీటిని తాగడం వల్ల అన్ని రకాల క్యాన్సర్లకు 9 నెలలలో కాస్త ఉపశమనం లభిస్తుంది. అంతేకాదు నరాలలో బ్లాక్ లు ఏర్పడిన వారు ప్రతి రోజూ గోరువెచ్చని నీటిని తాగడం వల్ల ఆరు నెలల్లో ఆ బ్లాక్ లు తొలగిపోతాయి. మూత్ర సంబంధిత సమస్యలతో బాధపడే వారు గోరువెచ్చని నీటిని తాగడం వల్ల పది రోజులలో ఉపశమనం పొందుతారు.
గుండె సంబంధిత సమస్యలకు చెక్
కన్ను, ముక్కు, గొంతు, చెవి సమస్యలతో ఇబ్బంది పడే వారు సైతం గోరువెచ్చని నీటిని తాగడం వల్ల పదిరోజుల్లో వాటినుంచి ఉపశమనం పొందుతారు. గోరువెచ్చని నీటిని తాగడం వల్ల జలుబు, దగ్గు వంటి సమస్యలు నుంచి కూడా సులభంగా బయటపడవచ్చు. అంతేకాదు తలనొప్పి, మైగ్రేన్ వంటి సమస్యలతో బాధపడేవారు గోరువెచ్చని నీటిని తాగడం వల్ల మూడు రోజుల్లో దాని నుండి ఉపశమనం లభిస్తుంది. గుండె సంబంధిత అనారోగ్యంతో బాధపడే వారికి 30 రోజులలో కాస్త ఉపశమనం దొరుకుతుంది.
కొలెస్ట్రాల్ , ఆస్తమా నుండి బిగ్ రిలీఫ్
గోరువెచ్చని నీటిని తాగడం వల్ల కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడేవారు నాలుగు నెలల్లో కాస్త ఆ సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఇక ఆస్తమా సమస్యతో ఇబ్బంది పడే వాళ్లు గోరు వెచ్చని నీటిని తాగితే నాలుగు నెలల్లో సమస్య నుంచి రిలీఫ్ పొందుతారు. మొత్తంగా చూస్తే మన జీవితంలో గోరువెచ్చని నీటిని రోజు తాగే అలవాటు చేసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని తాజా లెక్కల బట్టి తెలుస్తుంది.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. దీనిని మేము ధృవీకరించలేదు.
0 Comments:
Post a Comment