Health Tips: రాత్రి భోజనం మానేయడం వల్ల చాలా నష్టాలు.. అవేంటంటే..!
Health Tips: మనం జీవితంలో ఎంత బిజీగా ఉన్నా ఉదయం, మధ్యాహ్నం, రాత్రి భోజనం చేయడం చాలా ముఖ్యం. ఇది శరీర పోషణకు, అభివృద్ధికి చాలా అవసరం.
అయితే కొంతమంది రాత్రి భోజనం చేయకుండానే నిద్రకు ఉపక్రమిస్తారు. దీని వెనుక చాలా కారణాలు ఉంటాయి. ఆఫీసు నుంచి ఆలస్యంగా ఇంటికి రావడం వల్ల అలసిపోయి పడుకున్న వెంటనే నిద్రపోతాడు. మరికొంతమంది రాత్రి భోజనం చేయకపోతే బరువు తగ్గుతారని అనుకుంటారు. ఇందులో నిజం లేదు. రాత్రి భోజనం మానేయడం వల్ల ఎలాంటి చెడు ప్రభావాలు కలుగుతాయో ఈ రోజు తెలుసుకుందాం.
1. పోషకాల లోపం
రాత్రిపూట ఆహారం తీసుకోకపోతే అది పెద్ద తప్పు అవుతుంది. ఎందుకంటే శరీరంలో పోషకాల కొరత ఏర్పడుతుంది. దీని ప్రభావం శరీర పనితీరుపై పడుతుంది. ఈ పరిస్థితిలో మీరు బలహీనంగా మారుతారు. రక్తహీనత సమస్యని ఎదుర్కొంటారు.
2. శక్తి లోపించే ప్రమాదం
రాత్రి భోజనం చేయకపోతే అది ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. దీనిని ఎంత త్వరగా మానుకుంటే అంత మంచిది. ఎందుకంటే రాత్రి నిద్రపోతున్నప్పుడు శారీరక శ్రమలు చేయకపోయినా మెదడు పనిచేస్తూనే ఉంటుంది. ఈ పరిస్థితిలో నిద్రలో శక్తి లేకపోవడం వల్ల మరుసటి రోజు బలహీనత, అలసట ఏర్పడుతుంది.
3. నిద్రలో ఆటంకాలు
మీరు రాత్రిపూట భోజనం చేయకుండా నిద్రపోతే అర్ధరాత్రి అకస్మాత్తుగా మెలకువ వస్తుంది. ఆకలిగా ఉంటుంది. దీని కారణంగా మీరు 8 గంటల ప్రశాంతమైన నిద్రను పొందలేరు. మరుసటి రోజు బద్ధకం, అలసిపోయినట్లు అనిపిస్తుంది. అందుకే డిన్నర్‌ను ఎప్పుడూ స్కిప్ చేయవద్దు.
0 Comments:
Post a Comment