Health Tips: ఈ వంటనూనెలు చెడు కొలస్ట్రాల్‌ని పెంచుతాయి..ఇప్పుడే వదిలేయండి..!
Health Tips: మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఆయిల్ ఫుడ్ తీసుకోవడం తగ్గించాలి. ఎందుకంటే ఆయిల్ రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పరిమాణాన్ని పెంచుతుంది.
దీనివల్ల అధిక రక్తపోటు, మధుమేహం, గుండెపోటు, వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. నూనె తినడం వల్ల మనకు మేలు జరగదని కాదు. ఇవి శరీరానికి అవసరమైన కొవ్వులను అందిస్తాయి. కరిగే విటమిన్ల శోషణలో సహాయపడతాయి. అయితే మనకు ప్రమాదకరమైన అనేక నూనెలు ఉన్నాయి. వీటిని మాత్రం వాడకూడదు.
వైద్యుల ప్రకారం రిఫైన్డ్ ఆయిల్ తీసుకోవడం చాలా ప్రమాదకరం. చౌకగా ఉండటంతో చాలా మంది వీటిని ఉపయోగిస్తున్నారు. అయితే ఇవి ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. రైస్ బ్రాన్ ఆయిల్, వేరుశెనగ నూనె, సన్‌ఫ్లవర్ ఆయిల్, సోయాబీన్ ఆయిల్, కార్న్ ఆయిల్ మొదలైన వాటిని వాడకూడదు. వీటికి బదులుగా దేశీ నెయ్యి, కొబ్బరి నూనె, ఆవాల నూనె, వేరుశనగ నూనె, నువ్వుల నూనె వాడుకోవచ్చు.
నూనె అస్సలు తినకూడదా?
స్థూలకాయం ఉన్నవారు ఎక్కువగా నూనె తినకూడదు. ఆరోగ్యం బాగుండాలంటే తక్కువ నూనె తీసుకోవాలి. అది కూడా సహజసిద్దమైన నూనెలు వాడాలి. వీటి వల్ల జీర్ణ వ్యవస్థ బాగుంటుంది. ఎలాంటి సైడ్ ఎఫెక్స్ ఉండవు. కానీ రిఫైన్డ్ ఆయిల్స్ మంచివి కావు. వీటికి ఎటువంటి వాసన ఉండదు. వీటిలో రసాయనాలు కూడా కలుపుతున్నారు. ఇందులో ఎటువంటి పోషకాలు ఉండవని గుర్తుంచుకోండి.
0 Comments:
Post a Comment