Hair Tips - ఈ ఈ సింపుల్ రెమెడీని పాటిస్తే తెల్ల జుట్టు సహజంగానే నల్లగా మారుతుంది!
తెల్ల జుట్టు.. ఇటీవల కాలంలో చాలా మంది పాతిక, ముప్పై ఏళ్లకే ఈ సమస్యతో సతమతమవుతున్నారు. ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, పోషకాల కొరత, జుట్టు సంరక్షణ లేకపోవడం తదితర అంశాలు ఇందుకు కారణాలుగా మారుతుంటాయి.
కారణం ఏదైనా తెల్ల జుట్టు వృద్ధాప్యానికి సంకేతం. పైగా తెల్ల జుట్టు అందాన్ని తీవ్రంగా దెబ్బ తీస్తుంది. అందుకే వైట్ హెయిర్ ని కవర్ చేసుకునేందుకు కలర్స్ పై ఆధారపడుతుంటారు. అయితే తెల్ల జుట్టును సహజంగా కూడా నల్లగా మార్చుకోవచ్చు. అందుకు ఇప్పుడు చెప్పబోయే సింపుల్ రెమెడీ అద్భుతంగా సహాయపడుతుంది.
ఈ రెమెడీని వారంలో రెండు సార్లు కనుక పాటిస్తే మీ వైట్ హెయిర్ న్యాచురల్ గానే బ్లాక్ అవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఆ సింపుల్ రెమెడీ ఏంటో ఓ చూపు చూసేయండి. ముందుగా ఒక పెద్ద సైజు బంగాళదుంపను తీసుకుని దానికి ఉండే తొక్కను సపరేట్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ ను పోయాలి. వాటర్ కాస్త హీట్ అవ్వగానే అందులో సపరేట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప తొక్కలు వేసుకోవాలి. అలాగే రెండు టేబుల్ స్పూన్లు కాఫీ పౌడర్ వేసి కనీసం పది నిమిషాల పాటు ఉడికించాలి.
ఆ తర్వాత స్టైనర్ సహాయంతో వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి. ఈ వాటర్ లో వన్ టేబుల్ స్పూన్ ఆల్మండ్ ఆయిల్, ఒక కోడిగుడ్డు పచ్చ సొన వేసి స్పూన్ సహాయంతో బాగా మిక్స్ చేసుకోవాలి. ఆపై ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్లై చేసి షవర్ క్యాప్ ధరించాలి. దాదాపు రెండు గంటల అనంతరం మైల్డ్ షాంపూ యూస్ చేసి గోరు వెచ్చని నీటిలో శుభ్రంగా తల స్నానం చేయాలి.
వారంలో రెండు సార్లు ఈ సింపుల్ రెమెడీని కనుక పాటిస్తే తెల్ల జుట్టు సహజంగానే నల్లబడుతుంది. అలాగే ఈ రెమెడీని పాటించడం వల్ల జుట్టు కుదుళ్ళను బలోపేతం చేసే ప్రోటీన్లు లభిస్తాయి. తద్వారా జుట్టు రాలడం, చిట్లడం వంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి.
0 Comments:
Post a Comment