దొడ్డిదారి బదిలీలకు జాబితా సిద్ధం! ఆర్జేడీలు, డీఈవోలకు నేడు అందజేత!
ఈనాడు, అమరావతి: ఉపాధ్యాయుల సాధారణ బదిలీలకు షెడ్యూల్ ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం.. రాజకీయ పలుకుబడితో పైర వీకారులను దొడ్డిదారిన మార్చేందుకు రంగం సిద్ధంచేసింది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధుల సిఫార్సులతో కూడిన 120 మంది ఉపాధ్యాయుల జాబితాను ఇటీవల ప్రభుత్వం ఆమో దించింది. వీటిని పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్‌కు పంపించింది.. పైరవీ బదిలీలపై గతంలో ఉపాధ్యాయుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావ డంతో కొంతకాలం బయటకు తీయకుండా పక్కన పెట్టారు. తాజాగా సాధారణ బదిలీలకు ముందు దీన్ని బయటకు తీస్తున్నారు. జిల్లాల వారీగా వివరాలను ఆన్లైన్లో జిల్లా విద్యాధికారులకు పంపితే పేర్లు బయటకు వచ్చేస్తున్నాయనే ఉద్దేశంతో విజయవాడలో బుధవారం జర గనున్న సమావేశంలో ఈ జాబితాలను రహస్యంగా ఆర్జేడీలు, డీఈవో లకు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సాధారణ బదిలీల కంటే ముందు పైరవీ బదిలీలు పూర్తిచేసి, ఈ స్థానాలను ఆన్లైన్లో లో బ్లాక్ చేస్తారు. దీంతో సాధారణ ఉపాధ్యాయులకు ఈ స్థానాలు కన్పించవు.. పైరవీ బదిలీల్లో హెచ్ఎస్ఏ ఎక్కువగా ఉండేవి, పట్టణాలకు సమీపం లోని పాఠశాలలే ఉన్నట్లు సమాచారం. 2020లో సాధారణ బదిలీలు చేసినప్పుడు 15వేల పోస్టులను బ్లాక్ చేశారు. ఇవన్నీ పట్టణాలు, నగ రాలు, మండల కేంద్రాలకు సమీపంలోనివే. దీంతో చాలామంది మారు మూల ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చింది. సాధారణ బదిలీలకు ప్రభుత్వం మంగళవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది..
0 Comments:
Post a Comment