God - ఇంట్లో దేవుడిని పూజిస్తున్న సమయంలో ఈ పొరపాట్లు చేయకూడదట
హైందవ సంస్కృతి సాంప్రదాయంలో భగవంతుడిని పూజించడం అనేది ఆనవాయితీ. అందులో భాగంగా ప్రతి ఇంట్లోను దాదాపు ప్రతి రోజు భక్తితో భగవంతుడి ఎదుట దీపం వెలిగించి స్వామిని ఆరాధించడం అనేది విధిగా చేస్తుంటాము.
పూజ సమయంలో దీపం వెలిగించి దేవుడి మంత్రాలను జపిస్తూ.. పూలు, పండ్లు, పాలు వంటి వాటిని స్వామికి నైవేద్యంగా సమర్పించి మనసారా ఆయన కృప మనపై ఉండాలని పూజలు చేస్తూ ఉంటాము. అయితే, మనం పూజ చేసే తప్పుడు కొన్ని నియమ నిబంధనలు పాటిస్తూ చేయాలి. మనకు నచ్చినట్టుగా చేయకూడదు.
పూజ ఓ పద్దతి ప్రకారం చేయాలట మనం తెలిసీ తెలియక చేసే కొన్ని పొరపాట్లు మనకు మంచికి బదులు చెడుని కలిగిస్తాయని నిపుణులు అంటున్నారు. అయితే పూజా విధానాలు ఏంటి? ఎలా పూజ చేస్తే మంచిది అనే విషయాలు తెలుసుకుందాం.. * దూపం..దేవుడికి పూజ చేసే క్రమంలో..
అగరబత్తీలు వెలిగిస్తాం. ఆ వెలిగించిన అగరబ్తీలు పొగరావాలని చాలా మంది నోటితో ఊదుతారు. కానీ.. నిజానికి అలా ఊదకూడదట.
ధూపం కూడా.. వెలిగించిన తర్వాత దానిని అలానే వదిలేయాలట. అప్పుడు మంచి జరుగుతుందట. అలా కాకుండా నోటితో ఊదితే..
దోషం జరిగే ప్రమాదం ఉంది. * ఇక భోజనం చేసిన తర్వాత మనం పూజ చేయకూడదు. భోజనానికి ముందు మాత్రమే పూజ చేయాలి. ఎందుకంటే..
భోజనంలో ఉల్లిపాయలు.. ఇతర ఆహార పదార్థాలు తీసుకుంటాం. ఆ వాసన నోటిలోనే ఉండిపోతుంది. అలా ఆ నోటితో మంత్రాలు పటించడం తప్పు.
అందుకే శుభ్రంగా స్నానం చేసి.. భోజనానికి ముందు పూజ చేయాలి. అలాగే పొగాకు తాగిన తర్వాత కూడా దేవుడికి పూజ చేయకూడదు. * ఇక దేవుడికి పూజ చేసే సమయంలో..
చిరిగిన దుస్తులను ఎప్పుడూ ధరించకూడదు. చిరిగిన దుస్తులు ధరిద్రానికి సంకేతం. కాబట్టి.. శుభ్రంగా ఉన్న దుస్తులను మాత్రమే ధరించాలి.
* ఇక చాలా మంది దేవుడికి పూజించే పూలల్లో తులసి ఆకులను కలుపుతుంటారు. అలా తులసితో పూజించడం మంచిదని భావిస్తారు. కానీ.. వినాయకుడికి పెట్టకూడదట.
గణేశుడికి తులసి ఆకులతో పొరపాటున కూడా పూజ చేయకూడదు. * కేతకీ పుష్పాన్ని శివునికి ఎప్పుడూ పెట్టకూడదు.. కార్తీక మాసంలో విష్ణుమూర్తికి ఈ పుష్పాన్ని పెట్టడం మంచిది. * తులసి ఆకు స్నానం చేయకుండా మొక్క నుండి కోయకూడదు.
అలా స్నానం చేయకుండా ఆకులను కోస్తే.. వాటిని ఏ దేవుడు అంగీకరించడట. అదేవిధంగా ఆదివారం తులసి మొక్కకు నీరు పోయకూడదు. అది ఇంటికి మంచిది కాదు.
* స్నానం చేసేటప్పుడు దేవుని విగ్రహాలను కడగడం, బొటనవేలు తో రుద్దడం లాంటివి చేయకూడదు. ఇది దేవునికి కోపం తెప్పిస్తుంది. * పూజలో నెయ్యి ఉపయోగించడం సర్వసాధారణం. కానీ గడ్డకట్టిన, నీళ్లతో కూడిన నెయ్యిని దేవుడికి సమర్పించకూడదు.
నీటి వాసన కూడా తగకూడదు. * ఒక దీపం నుండి మరొక దీపానికి ఎప్పుడూ వెలిగించకూడదు. ఇది అనారోగ్యం, పేదరికాన్ని ఆహ్వానిస్తుంది. దీపం దక్షిణం వైపు ఉండకూడదు.
* లక్ష్మీ పూజ శ్రావణ నక్షత్రంలో లేదా ఋతిక తిథిలో ఎప్పుడూ పూజించకూడదు. *పూజ్యమైన ఆరాధన సమయంలో గౌరవప్రదమైన వ్యక్తి వచ్చినట్లయితే, అతన్ని విస్మరించకూడదు. వారిని అభినందిస్తూనే పూజ కొనసాగించాలి. అంతే తప్ప పూజ మధ్యలో వదిలి వెళ్ళకూడదు.
0 Comments:
Post a Comment