Food For Lungs: ఊపిరితిత్తుల సమస్యలకు ఈ 3 పదార్థాలతో చెక్ పెట్టొచ్చు..
Food For Lungs: శరీరానికి ఊపిరితిత్తులు పనితీరు కీలక పాత్ర పోషిస్తుంది. అయితే కరోనా మహమ్మారి తర్వాత చాలా మందిలో ఊపిరితిత్తుల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.
ముఖ్యంగా ఈ అవయవం చెడిపోవడానికి ప్రధాన కారణాలు కలుషిత వాతావరణం, ధూమపామేనని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా చాలా మందిలో ఊపిరితిత్తుల సంక్రమణ వ్యాధులు కూడా వస్తున్నాయి. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఆరోగ్య నిపుణులు సూచించిన ఈ చిట్కాలను వినియోగించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడం కూడా ఊపిరితిత్తులకు చాలా అవసరం. ఎలాంటి ఆహారాలు తీసుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఊపిరితిత్తుల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు తప్పకుండా ధూమపానానికి దూరంగా ఉండడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా దీనిని మానుకోవడం వల్ల ఊపిరితిత్తులు మెరుగుపడే అవకాశాలున్నాయి. అంతేకాకుండా ఆహారంలో ప్రతి. రోజూ అరటిపండ్లు, టమోటాలు, బచ్చలికూరను తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆహారాలను ప్రతి రోజూ తీసుకుంటే శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలగడమేకాకుండా అధిక రక్తపోటు సమస్యలు కూడా తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా శరీరం దృఢంగా తయారవుతుంది.
ఈ ఆహారాలు తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది:
1) నల్ల మిరియాలు:
నల్ల మిరియాల్లో శరీరానికి అవసరమైన విటమిన్ సి లభిస్తుంది. కాబట్టి వీటిని ప్రతి రోజూ ఆహారంలో వినియోగిస్తే ఊపిరితిత్తులకు ప్రయోజనకరంగా ఉంటుంది. అంతేకాకుండా ఇందులో నీటిలో కరిగే పోషకాలు కూడా ఉంటాయి. శరీర బరువును తగ్గించికోవచ్చు.
2) పసుపు:
భారతీయులు పసుపును వంటకాల్లో ఎక్కువగా వినియోగిస్తారు. ఇందులో శరీరానికి కావాల్సిన చాలా రకాల ఔషధ గుణాలుంటాయి. కాబట్టి వీటిని క్రమం తప్పకుండా వినియోగిస్తే శరీరానికి యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు లభించి ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది. కాబట్టి తప్పకుండా ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నవారు తప్పకుండా పసుపును వినియోగించాల్సి ఉంటుంది.
3) అల్లం:
అల్లం ఊపిరితిత్తుల వ్యాధులకు ప్రభావవంతంగా సహాయపడుతుంది. ఇందులో ఉండే గుణాలు హైపెరాక్సియా, వాపు వల్ల కలిగే తీవ్రమైన సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కాబట్టి తప్పకుండా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు అల్లాన్ని వినియోగించాల్సి ఉంటుంది.
0 Comments:
Post a Comment