Search This Blog

Tuesday, 27 December 2022

Flipkart Year End Sale 2022 : ఫ్లిప్‌కార్ట్ ఇయర్ ఎండ్ సేల్‌.. 2022లో బెస్ట్ 5G స్మార్ట్‌ఫోన్లపై అదిరే డీల్స్.. లిమిటెడ్ ఆఫర్ మాత్రమే.. డోంట్ మిస్..!

 Flipkart Year End Sale 2022 : ఫ్లిప్‌కార్ట్ ఇయర్ ఎండ్ సేల్‌.. 2022లో బెస్ట్ 5G స్మార్ట్‌ఫోన్లపై అదిరే డీల్స్.. లిమిటెడ్ ఆఫర్ మాత్రమే.. డోంట్ మిస్..!

Flipkart Year End Sale 2022 : 2022 సంవత్సరం అతి త్వరలో ముగియనుంది. ఆన్‌లైన్ వినియోగదారులకు ఇదే సరైన అవకాశం.. స్మార్ట్‌ఫోన్‌లపై బెస్ట్ డీల్‌లను సొంతం చేసుకోవచ్చు.
ఈ-కామర్స్ దిగ్గజాల్లో ఒకటైన ఫ్లిప్‌కార్ట్ (Flipkart) తన ప్లాట్‌ఫారమ్‌లో కొత్త ఇయర్ ఎండ్ సేల్ (Flipkart Year End Sale 2022) ఈవెంట్‌ను నిర్వహిస్తోంది. ఈ సేల్ సందర్భంగా కొనుగోలుదారులు అనేక అద్భుతమైన డీల్స్ పొందవచ్చు. అందులో స్మార్ట్‌ఫోన్లతో పాటు ఇతర గాడ్జెట్లపై కూడా భారీ డిస్కౌంట్లను పొందవచ్చు.

శాంసంగ్ గెలాక్సీ బడ్స్ (Samsung Galaxy Buds 2) వంటి వైర్‌లెస్ ఇయర్‌బడ్‌లపై కూడా అదిరే డీల్‌లను పొందవచ్చు. మరో ఈ-కామర్స్ దిగ్గజం (Amazon)లో కూడా శాంసంగ్ గెలాక్సీ బడ్స్ 2పై రూ. 6,894 తగ్గింపు ధరతో లభిస్తుంది. అంతేకాదు.. మరెన్నో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఆపిల్ ఐఫోన్ 13 (iPhone 13) అతి తక్కువ ధరకు కొనుగోలు చేసేందుకు ఫ్లిప్‌కార్ట్ మళ్లీ ఛాన్స్ అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ ప్రారంభ ఇయర్ ఎండ్ సేల్ సందర్భంగా కొన్ని బెస్ట్ 5G ఫోన్ డీల్స్ అందిస్తోంది. అందులో మీకు నచ్చిన స్మార్ట్‌ఫోన్ తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. అవేంటో ఓసారి చూద్దాం..

 
Flipkart Year End Sale 2022 Best 5G Smartphones on iPhone 13, Pixel 6a with discounts

ఫ్లిప్‌కార్ట్ ఇయర్ ఎండ్ సేల్‌.. బెస్ట ఫోన్ డీల్స్ ఇవే :
ఫ్లిప్‌కార్ట్ ఇయర్ ఎండ్ సేల్ సమయంలో ఆపిల్ (iPhone 13 5G) మోడల్ చాలా తక్కువ ధరకు అందుబాటులో ఉంది. 128GB స్టోరేజ్ మోడల్ ధర రూ. 61,999 ప్రారంభ ధరతో లిస్టు అయింది. (Apple iPhone 13) మోడల్ తమ స్టోర్ల ద్వారా రూ. 69,990కి విక్రయిస్తోంది. iPhone 14 సిరీస్‌ను లాంచ్ చేసిన తర్వాత ఇదే ఐఫోన్ అధికారిక ధరగా మారింది. ఈ డివైజ్‌పై మీరు రూ. 7,991 డిస్కౌంట్ పొందవచ్చు. (Flipkart) సాధారణంగా ఏదైనా ఫోన్ ధరను విక్రయించిన కొద్ది రోజుల్లోనే ధరను అమాంతం పెంచేస్తుంది. మీరు ఐఫోన్ 13 కొనాలని ప్లాన్ చేస్తుంటే మాత్రం వెంటనే కొనేసుకోండి. లేదంటే ధర ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉంది.
ఐఫోన్ 13 గత ఏడాదిలో లాంచ్ అయింది. అయితే ఇప్పటికీ పర్ఫార్మెన్స్ పరంగా బెస్ట్ ఫోన్ అని చెప్పవచ్చు. ఈ ఫోన్ సాఫ్ట్‌వేర్ గురించి కొనుగోలుదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆపిల్ 6ఏళ్ల పాత ఫోన్‌లకు కూడా అప్‌డేట్‌లను అందిస్తోంది. అయినప్పటికీ, ఈ డివైజ్ కెమెరా అంత గొప్పది కాదని గమనించాలి. ఒకవేళ మీరు కొత్త స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటే.. Samsung Galaxy S22+ మోడల్ కొనుగోలు చేయవచ్చు. Galaxy S22+ వేగవంతమైన పర్ఫార్మెన్స్, అద్భుతమైన కెమెరా ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్ చాలా తక్కువ ధరకు సేల్ అవుతోంది. ఫ్లిప్‌కార్ట్‌లో Samsung Galaxy S22+ ఫోన్ ప్రస్తుతం రూ. 69,999 ప్రారంభ ధరతో విక్రయిస్తోంది. ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై 10 శాతం ఇన్ స్టంట్ డిస్కౌంట్ కూడా అందిస్తుంది.

 
Flipkart Year End Sale : 2022 Best 5G Smartphones on iPhone 13, Pixel 6a with discounts

2022 ఏడాది ప్రారంభంలో రిలీజ్ అయిన Pixel 6a ఫోన్ ప్రారంభ ధర రూ. 43,999గా ఉంది. అయితే ఫ్లిప్‌కార్ట్ ఇయర్ ఎండ్ సేల్ సందర్భంగా ఈ డివైజ్ భారీ తగ్గింపును పొందింది. ఎలాంటి నిబంధనలు లేకుండా షరతులతో ధర రూ.29,999కి తగ్గింది. ఇతర కొన్ని ప్రముఖ ఫోన్‌ల కన్నా మెరుగైన కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇతర డివైజ్‌ల కన్నా చాలా ముందుగానే అద్భుతమైన సాఫ్ట్‌వేర్ ఎక్స్ పీరియన్స్ కలిగి ఉంది. లేటెస్ట్ Android ఫీచర్లను కూడా కలిగి ఉంది. మొత్తం మీ ఈ ఫోన్ పర్ఫార్మెన్స్ డీసెంట్‌గా ఉందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.

మోటోరోలా నుంచి రిలీజ్ అయిన (Moto Edge 30) ఫోన్ ధర రూ. 22,999కి కొనుగోలు చేయవచ్చు. ఇప్పటికి తక్కువ ధరకే అందుబాటులో ఉంది. ఈ మోటో ఫోన్ భారత మార్కెట్లో దాదాపు రూ. 30,000కి లాంచ్ అయింది. తగినంత బెస్ట్ పర్ఫార్మెన్స్ అందించగల ఆల్ రౌండర్ 5G స్మార్ట్‌ఫోన్ అని చెప్పవచ్చు. ఇంతకంటే మరింత సరసమైన 5G ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే (Samsung Galaxy F23 5G)ని కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ ధర రూ. 14,999కి అందుబాటులో ఉంది. అయితే ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగదారులు ఈ ఫోన్ రూ. 13,499 ధరతో కొనుగోలు చేయవచ్చు. ఇంకెందుకు ఆలస్యం.. ఫ్లిప్ కార్ట్ ఇయర్ ఎండ్ సేల్ ముగిసేలోగా వెంటనే మీకు నచ్చిన స్మార్ట్‌ఫోన్ సొంతం చేసుకోండి.


0 Comments:

Post a Comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Technology

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top