Flight Ticket Offer: రూ.1,399కే విమాన టికెట్.. 2 రోజులే ఆఫర్!
AirAsia Sale | విమాన ప్రయాణం చేయాలని భావిస్తున్నారా? అయితే గుడ్ న్యూస్. మీ కోసం అదిరిపోయే ఆఫర్ ఒకటి అందుబాటులో ఉంది. ప్రముఖ విమానయాన కంపెనీల్లో ఒకటైన ఎయిర్ఏసియా (AirAsia) అదిరే ఆఫర్ తీసుకువచ్చింది.
అతితక్కువ ధరకే విమాన టికెట్లు (Flight Ticket) అందుబాటులో ఉంచింది. ఈ ఆఫర్ పరిమిత కాలం వరకే ఉంటుందని గుర్తించుకోవాలి. అందువల్ల కొత్త ఏడాది ఫ్లైట్ జర్నీ చేయాలని భావించే వారు ఈ డీల్‌ను వెంటనే సొంతం చేసుకోవచ్చు. ఎయిర్ఏసియా ఇండియా తాజాగా న్యూ ఇయర్ న్యూ డీల్స్ సేల్ తీసుకువచ్చింది. ఈ టికెట్ ధర డిస్కౌంట్ ఆఫర్ ఇప్పటికే ముగియాల్సి ఉంది. అయితే కంపెనీ మాత్రం ఈ సేల్‌ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా టికెట్ ధరలను కూడా మరింత తగ్గించేసింది. తొలిగా రూ. 1497తో విమాన టికెట్లు పొందొచ్చని కంపెనీ ఈ సేల్‌ను తీసుకువచ్చింది. డిసెంబర్ 25తోనే ఈ ఆఫర్ ముగియాల్సి ఉంది. అయితే కంపెనీ తర్వాత కూడా ఈ సేల్‌ను పొడిగించింది.
గ్యాస్ సిలిండర్‌పై భారీ తగ్గింపు.. ఫ్లిప్‌కార్ట్ బంపరాఫర్!
కంపెనీ అదిస్తున్న ఈ డిస్కౌంట్ సేల్ డిసెంబర్ 29 వరకు అందుబాటులో ఉండనుంది. అందువల్ల మీరు విమాన టికెట్లు బుక్ చేసుకోవాలని భావిస్తే.. ఈ ఆఫర్ పొందొచ్చు. కాగా మీరు ఎంచుకునే రూట్ ప్రాతిపదికన టికెట్ రేట్లు మారతాయి. అలాగే డేట్ ప్రాతిపదికన కూడా విమాన టికెట్ల రేట్లలో మార్పు ఉంటుంది. అందువల్ల టికెట్ బుక్ చేసుకునే సమయంలో ఈ విషయాన్ని గుర్తించుకోవాలి.
ఎయిర్ఏసియా అందిస్తున్న న్యూ ఇయర్ న్యూ డీల్స్‌లో భాగంగా టికెట్ ధర రూ. 1,399 నుంచి ప్రారంభం అవుతోంది. ఆఫర్‌లో భాగంగా విమాన టికెట్లు బుక్ చేసుకున్న వారు 2023 జనవరి 10 నుంచి 2023 సెప్టెంబర్ 30 వరకు ఎప్పుడైనా ప్రయాణం చేయొచ్చు. అంతేకాకుండా ఇది లిమిటెడ్ సీట్లకు మాత్రమే వర్తిస్తుంది. అందువల్ల ముందుగా ఎవరైనా సీట్లు బుక్ చేసుకుంటారో వారికే ఆఫర్ వర్తించే ఛాన్స్ ఉంటుంది. సీట్లు అయిపోతే తర్వాత రెగ్యులర్ ధరకే టికెట్లు బుక్ చేసుకోవాల్సి వస్తుంది. కాగా టాటా గ్రూప్‌కు చెందిన విమానయాన కంపెనీయే ఎయిర్ఏసియా.
0 Comments:
Post a Comment