Fish Snacks : ఏపీలో ఇక మార్కెట్లోకి చేపలు, రొయ్యల స్నాక్స్.
చేపలు(Fish), రొయ్యలు, పీతలతో తయారు చేసిన చిరుతిళ్లను 'రెడీ టు ఈట్ ఫుడ్' రూపంలో విక్రయించడానికి ప్రభుత్వం(Govt) చర్యలు తీసుకుంటోంది.
దీని కోసం ప్రభుత్వం ఒక ప్రణాళికతో ముందుకు వచ్చింది. అధిక ప్రోటీన్ విలువ, ప్రజల ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకుంది. గ్రామ/వార్డు సచివాలయాల వద్ద రిటైల్ అవుట్‌లెట్‌లను ఏర్పాటు చేయడం ద్వారా సముద్ర, మంచినీటి నుంచి పట్టుకున్న తాజా చేపలు, అనుబంధ ఉత్పత్తుల విక్రయాలను AP ప్రభుత్వం ముందుగా చేపట్టింది.
అయితే ఇప్పుడు షాపులను ఏర్పాటు చేసి.. చికెన్ 65(Chicken 65), చికెన్ పకోరా, చిల్లీ చికెన్, గార్లిక్ చికెన్ మొదలైన వాటి తరహాలో చేపలు, రొయ్యలు, పీతలతో చేసిన స్నాక్స్ విక్రయాలను ప్రోత్సహిస్తుంది. చేపలు, దాని అనుబంధ ఉత్పత్తుల తలసరి వినియోగం 2024 నాటికి పెరగాలని ప్రభుత్వం అనుకుంటోంది. దీనిని అమలు చేయడానికి మత్స్య శాఖతో చర్చలు జరిగాయి. దేశీయ వినియోగాన్ని మరింత ప్రోత్సహించడం ద్వారా క్షీణిస్తున్న ఎగుమతి(Export) వాల్యూమ్‌లను భర్తీ చేయాలని కూడా అనుకుంటోంది.
చేపలు, దాని అనుబంధ ఉత్పత్తులను స్నాక్స్(Snacks) రూపంలో వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం హైదరాబాద్(Hyderabad)కు చెందిన 'బెస్ట్ ఫ్రెష్ ఫ్రైస్' అనే ఏజెన్సీతో మాట్లాడుతోంది. రిటైల్ అవుట్‌లెట్‌లను ఏర్పాటు చేయడం ద్వారా చేపలు, దాని అనుబంధ ఉత్పత్తులతో తయారు చేసిన చిరుతిళ్ల విక్రయాలను చేపట్టేలా నిరుద్యోగ యువతను ప్రోత్సహించాలని ప్లాన్ ఉంది.
రూ.10లక్షలు, రూ.20లక్షలు, రూ.50లక్షలతో రిటైల్ అవుట్ లెట్ల ఏర్పాటుకు ప్రభుత్వం 40శాతం సబ్సిడీని అందిస్తుంది. ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి, మహిళలకు 60 శాతం సబ్సిడీ ఉంటుంది. గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో వివిధ ప్రదేశాలలో దుకాణాలను ఏర్పాటు చేసేందుకు సాధ్యాసాధ్యాలను తనిఖీ చేయడానికి ఓ ప్రైవేట్ ఏజెన్సీ(Private Agency) సర్వేను చేస్తుంది. ఇది స్నాక్స్ సిద్ధం చేయడానికి చెఫ్‌లకు కూడా శిక్షణ ఇస్తుంది. రిటైలర్లు విక్రయించిన ఆదాయంపై ప్రైవేట్ ఏజెన్సీకి 2.75 శాతం రాయల్టీ చెల్లించాలి.
0 Comments:
Post a Comment