Famous Gilded House: వియత్నాంలోని కాన్‌థో నగరంలో ఇటీవల నిర్మించిన బంగారు భవనం అంతర్జాతీయంగా వార్తల్లోకెక్కింది. ఎంగ్యూయెన్ వాన్ ట్రుంగ్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి కనీవినీ ఎరుగని రీతిలో ఇబ్బడిముబ్బడిగా సంపాదించాడు.
ప్రపంచంలోని అనేక దేశాలను సందర్శించిన తర్వాత, అతను తన సొంత నగరానికి తిరిగి వచ్చి నిజమైన పర్యాటక ఆకర్షణతో ఒక ఇంటిని నిర్మించాలని నిర్ణయించుకున్నాడు.
ఇళ్ల నమూనాలు చూడడానికి దేశదేశాల్లో సంచరించాడు. ఆర్కిటెక్ట్‌లు, ఇంటీరియర్ డెకరేటర్లతో చర్చోప చర్చలు జరిపాక, ఇదివరకు ఎవరూ కనీవినీ ఎరుగని రీతిలో బంగారు తాపడంతో ఇల్లు నిర్మించాలని నిశ్చయించుకుని, తన నివాసంగా బంగారు భవనాన్ని నిర్మించాడు.
గోడల నుంచి ఫర్నిచర్, వివిధ అలంకరణల వరకు, ప్రతిదీ బంగారంతో లేదా కనీసం బంగారు పూతతో చేసినట్లుగా కనిపిస్తుంది. దీంతో పర్యాటకులు కానో నగరానికి క్యూకట్టి.. ఆ ఇంటిని తిలకిస్తున్నారు.
అతను మాట్లాడుతూ.. తాను కొంతకాలం క్రితం పూతపూసిన ఇంటిని నిర్మించుకోవాలని నిర్ణయించుకున్నానని, అయితే ఆరేళ్ల క్రితమే దానిని నిజం చేయడానికి సమయం దొరికిందని అతను చెప్పాడు.
ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి మూడు సంవత్సరాలు పట్టింది, కానీ అది సిద్ధమైన వెంటనే, ఇది కొంతవరకు స్థానిక ఆకర్షణగా మారింది. ఇప్పుడు ఈ భవంతి వియత్నాం దేశానికే ప్రత్యేక ఆకర్షణగా మారింది.
వియత్నాం వచ్చే విదేశీ పర్యాటకులు పనికట్టుకుని మరీ కాన్‌థో నగరానికి వచ్చి, ఈ ఇంటిని కళ్లారా చూసి వెళుతున్నారు.
0 Comments:
Post a Comment