Fake Hallmark: ఫేక్ హాల్‌మార్క్‌తో బంగారు నగల అమ్మకం... ఇలా జాగ్రత్తపడండి....
బంగారు నగల కొనుగోలుదారులు మోసపోకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం గోల్డ్ మాల్‌మార్కింగ్ (Gold Hallmarking) తప్పనిసరి చేసింది. బంగారు నగల స్వచ్ఛతను తెలిపేందుకు హాల్‌మార్క్ ఉపయోగపడుతుంది.
18 క్యారెట్ల నగలైతే 18K మార్క్, 22 క్యారెట్ల నగలైతే 22K మార్క్ ఆభరణాలపై ఉంటుంది. హాల్‌మార్క్ ఉన్న నగలను విశ్వసించవచ్చని కొనుగోలుదారులు నమ్ముతుంటారు. నగలపై ప్రభుత్వ అధికార ముద్ర ఉందని భావిస్తారు. కానీ హాల్‌మార్క్ వచ్చిన తర్వాత కూడా దేశంలో కల్తీ బంగారు ఆభరణాల తయారీ, అమ్మకం యథేచ్ఛగా సాగుతోందని తేలింది. అంటే నగల్లో 22 క్యారెట్ గోల్డ్ లేకపోయినా 22K ముద్ర వేయడం, అవి హాల్‌మార్క్ నగలేనని (Hallmark Jewellery) నమ్మించడం మామూలైపోయింది.
కొందరు వ్యక్తులు బంగారు ఆభరణాలపై నకిలీ హాల్‌మార్కింగ్ (Fake Hallmarking) వేసి వినియోగదారులను మోసం చేస్తున్నారని హాల్‌మార్కింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (HFI) కూడా అంగీకరించింది. నకిలీ హాల్‌మార్కింగ్‌ను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఫెడరేషన్ ప్రభుత్వానికి లేఖ రాసింది. పాత హాల్‌మార్కింగ్ లోగోను ప్రభుత్వం ఇంకా నిషేధించలేదని HFI అధ్యక్షుడు జేమ్స్ జోస్ అన్నారు.
బంగారు ఆభరణాలపై నకిలీ హాల్‌మార్కింగ్ చేస్తూ తక్కువ క్యారెట్లు ఉన్న బంగారు ఆభరణాలను ఎక్కువ క్యారెట్లుగా నమ్మించి వినియోగదారులకు అమ్ముతున్నారు. పాత హాల్‌మార్కింగ్ లోగో సురక్షితం కాదని జోస్ చెప్పారు. నకిలీ హాల్‌మార్కింగ్‌ను అరికట్టడం కోసం, పాత లోగోను ఉపయోగించడానికి ప్రభుత్వం కాలపరిమితిని నిర్ణయించాలని, ఆ తర్వాత పూర్తిగా నిషేధించాలని హాల్‌మార్కింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా డిమాండ్ చేస్తోంది.
హాల్‌మార్కింగ్ అంటే ఏంటీ?
హాల్‌మార్కింగ్ అనేది బంగారం స్వచ్ఛతకు హామీ లాంటిది. హాల్‌మార్క్‌లో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) లోగో, దాని స్వచ్ఛత ఉంటుంది. ఏ పరీక్షా కేంద్రంలో హాల్‌మార్క్ వేశారో ఆ ముద్ర కూడా ఉంటుంది. బంగారం స్వచ్ఛతను క్యారెట్లతో నిర్ణయిస్తారన్న సంగతి తెలిసిందే. వ్యాపారులు తయారు చేసిన నగల్లో బంగారం ఎంత స్వచ్ఛతతో ఉంది అని హాల్‌మార్క్ ముద్ర చూస్తే తెలుస్తుంది. సాధారణంగా 18K, 22K బంగారు ఆభరణాలు అమ్ముడుపోతుంటాయి. కొన్నిసార్లు నగల వ్యాపారులు తక్కువ క్యారెట్ నగలను తయారు చేసి, ఎక్కువ క్యారెట్ ధరలను వసూలు చేస్తుంటారు. దీన్ని తొలగించేందుకు హాల్‌మార్కింగ్‌ను తప్పనిసరి చేశారు. ఇప్పుడు నకిలీ హాల్‌మార్క్ ముద్రతో మోసం చేస్తున్నారు వ్యాపారులు..
image source: BIS
అసలైన హాల్‌మార్క్ ఎలా ఉంటుంది?
గత ఏడాది జూలై 1 నుంచి బంగారు ఆభరణాల హాల్‌మార్కింగ్ గుర్తుల్లో ప్రభుత్వం మార్పులు చేసింది. ఈ గుర్తుల సంఖ్యను మూడుకు పెంచింది. మొదటి సంకేతం BIS హాల్‌మార్క్. ఇది త్రిభుజాకార గుర్తులా ఉంటుంది. రెండవ సంకేతం స్వచ్ఛత గురించి చెబుతుంది. అంటే ఆ నగలు ఎన్ని క్యారెట్ల బంగారంతో చేశారో చూపిస్తుంది. ఇక్కడ 18K, 22K అని చూడొచ్చు. ఇక మూడవ చిహ్నం HUID నంబర్ అని పిలువబడే ఆరు అంకెల ఆల్ఫాన్యూమరిక్ కోడ్. HUID అంటే హాల్‌మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్. ఈ ఆరు అంకెల కోడ్‌లో అక్షరాలు, అంకెలు కలిపి ఉంటాయి. హాల్‌మార్కింగ్ సమయంలో ప్రతి ఆభరణానికి HUID నంబర్ కేటాయించబడుతుంది. ఈ సంఖ్య ప్రత్యేకమైనది. అంటే ఒకే HUID నంబర్‌తో రెండు ఆభరణాలు ఉండవు.
0 Comments:
Post a Comment