CRPFలో 1458 ఏఎస్సై, హెడ్ కానిస్టేబుల్ పోస్టులు..
కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) భారీగా ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
ఈ పోస్టులు భర్తీ చేసేందుకు ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు:
అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (స్టెనోగ్రాఫర్) - 143
హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్) - 1315
మొత్తం పోస్టులు : 1458
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు/విశ్వవిద్యాలయం నుంచి ఇంటర్మీడియట్ (10+2) లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. ఎత్తు:
పురుషులకు - 165 సెం.మీ
మహిళలకు - 155 సెం.మీ
వయసు: 2023 జనవరి 25 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు ఏ ఎస్సై పోస్టులకు రూ. 29,200 నుంచి రూ. 92,300; హెచ్సీ పోస్టులకు రూ. 25,500 నుంచి రూ. 81,100 ఉంటుంది.
ఎంపిక: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, డిటైల్డ్ మెడికల్ టెస్ట్, రివ్యూ మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
రాతపరీక్ష: కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష 100 ప్రశ్నలు ..100 మార్కులకు ఉంటుంది. హిందీ/ఇంగ్లీష్ భాష, జనరల్ ఆప్టిట్యూడ్, జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి ప్రశ్నలు వస్తాయి.
సమయం: 90 నిమిషాలు.
దరఖాస్తు: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
దరఖాస్తులు ప్రారంభం: జనవరి 4, 2023.
చివరి తేదీ: జనవరి 25, 2023.
అడ్మిట్ కార్డులు : ఫిబ్రవరి 15, 2023.
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్: ఫిబ్రవరి 22 నుంచి 28, 2023.
వెబ్సైట్ : https://crpf.gov.in
0 Comments:
Post a Comment