Covid19: దేశంలో మళ్లీ కొవిడ్ కలకలం మొదలైంది. గురువారం పార్లమెంట్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్కడ్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఒక్కసారిగా మాస్క్లు పెట్టుకుని కనిపించారు.
దీంతో దేశంలో మరోసారి లాక్డౌన్ పెట్టనున్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి.
దీనికి తోడు ప్రభుత్వం సైతం కొవిడ్ గురించి వరుస ప్రకటనలు చేయడం, ప్రజల్ని అప్రమత్తంగా ఉండాలంటూ సూచనలు చేయడం వంటివి ఇలాంటి వాటికి మరింత ఊతాన్ని ఇస్తున్నాయి.
అయితే దేశంలో అలాంటి అవసరం లేదని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తేల్చి చెప్పింది. దేశంలో 95 శాతం మందికి వ్యాక్సినేషన్ అయిందని, లాక్డౌన్ అవసరం మన దేశానికి ఉండదని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యులు డాక్టర్ అనిల్ గోయెల్ అన్నారు.
దేశ ప్రజల్లో ఇమ్యూనిటీ ఎక్కువగా ఉందని, దీనికి తోడు దాదాపుగా వ్యాక్సినేషన్ జరిగిందని అన్నారు. అయితే లాక్డౌన్ అవసరం లేదని చెప్పిన ఆయన 'టెస్టింగ్, ట్రీటింగ్, ట్రేసింగ్' విధానానికి మారాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.
ఇదే సమయంలో ప్రజలు కొవిడ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని గోయెల్ సూచించారు. ప్రభుత్వం తెలిపే నిబంధనలను పాటించి, ఏమాత్రం ముప్పు లేకుండా చూడాలని అన్నారు.
మాస్కుల వినియోగం, శానిటైజర్ల వాడకం, వ్యక్తిగత దూరం వంటి నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని గోయెల్ సూచించారు.
0 Comments:
Post a Comment