Constipation: గ్యాస్ట్రిక్, మలబద్ధకం సమస్యల నుంచి ఇలా 15 నిమిషాల్లో ఉపశమనం పొందండి..
Constipation Home Remedies: ప్రస్తుతం చాలా మంది ఆధునిక జీవన శైలిని అనుసరించడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్య బారిన పడుతున్నారు. దీంతో పాటు మలబద్ధకం, పొట్టలో మంట ఇతర వ్యాధుల బారిన పడుతున్నారు.
అయితే ఈ వ్యాధుల నుంచి ఎంత సులభంగా ఉపశమనం పొందితే అంత మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. లేకపోతే తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. ఈ పొట్ట సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందగడానికి ఆయుర్వేద నిపుణులు సూచించిన ఈ చిట్కాలను వినియోగించాల్సి ఉంటుంది. ఆ చిట్కాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
బొప్పాయితో పొట్ట సమస్యలకు చెక్:
బొప్పాయి అనేక వ్యాధులకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే పొట్ట సమస్యలతో బాధపడుతున్నవారికి కూడా ఈ పండు ప్రభావవంతంగా పని చేస్తుంది.బొప్పాయిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ఈ పండు పొట్ట సమస్యలున్నవారు తింటే సులభంగా అన్ని రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే ఫైబర్, ప్రొటీన్, పొటాషియం, విటమిన్లు జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడతాయి.
ఓట్ మీల్ తప్పని సరి:
ఈరోజు చేసే అల్పాహారంలో ఓట్‌మీల్‌ను తప్పని సరిగా చేర్చుకోవాల్సి ఉంటుంది. ఇందులో పోషకాలు శరీరంలోని అనారోగ్య సమస్యలను తగ్గించడానికి కృషి చేస్తాయి. అంతేకాకుండా ఇందులో ఫోలేట్, రాగి, మాంగనీస్, ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు, ఐరన్, ఫైబర్ , బీటా గ్లూకోజ్ అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే శరీరానికి మంచి ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా మలబద్ధకం వంటి పొట్ట సమస్య దూరమవుతాయి.
అవిసె గింజలు:
అవిసె గింజలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి వీటిని ఆహారాల్లో వినియోగిస్తే బరువు తగ్గడమేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి. అయితే ప్రతి రోజూ అవిసె గింజలను వినియోగించడం వల్ల జీర్ణక్రియ వ్యవస్థ కూడా మెరుగుపడి..పొట్ట సమస్యలు కూడా తగ్గుతాయి.
0 Comments:
Post a Comment