Coconut And Jaggery Benefits: కొబ్బరి, బెల్లం కలిపి తీసుకుంటే ఎన్ని లాభాలో తెలుసా?
Coconut And Jaggery Benefits: మన ఆరోగ్య సంరక్షణకు మన పూర్వీకులు ఎన్నో మార్గాలు సూచించారు. కానీ మనం వాటిని పక్కన పెట్టి ఫిజాలు, బర్గర్లకు ప్రాధాన్యం ఇస్తున్నాం.
ఫలితంగా రోగాలకు మూలం అవుతున్నాం. చిన్న వయసులోనే అనేక రకాల వ్యాధులు రావడానికి కారకులం అవుతున్నాం. సహజసిద్ధమైన ఆహారాలను వదిలేసి ప్రొటీన్లు లేని వాటి కోసం పరుగులు పెడుతున్నాం. ఇలా మనం చేసే తప్పులే మనకు గుదిబండలా మారుతున్నాయి. అక్కరకు రాని వాటిని అక్కున చేర్చుకుంటే అక్కరకొచ్చే వాటిని దూరం చేసుకుంటున్నాం. ఇరవైలోనే అరవైలా జబ్బులను ఆశ్రయిస్తున్నాం. రోజు మందులు వేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నాం.
Coconut And Jaggery Benefits
మన పూర్వీకులు మనకు చూపించిన మార్గాల్లో వారు సూచించినవి తీసుకుంటే మనకు అనారోగ్య సమస్యలు రానే రావు. ఈ నేపథ్యంలో కొబ్బరి, బెల్లం గురించి తెలుసుకుందాం. కొబ్బరిలో మంచి ప్రొటీన్లు, విటమిన్లు దాగి ఉన్నాయి. అందుకే కేరళ వారు వంటల్లో కొబ్బరిని బాగా వాడటం వల్ల వారు తెలివిలో చురుకుగా ఉంటారు. అత్యధిక అక్షరాస్యత కలిగిన రాష్ట్రాల్లో కేరళ ముందుంటుంది. కొబ్బరితో మనకు ఎన్నో లాభాలున్నాయి. దీంతో వారికి అనారోగ్య సమస్యలు కూడా దరిచేరవు. కొబ్బరి బల్లం కలిపి తీసుకుంటే పలు ప్రయోజనాలు ఉన్న విషయం తెలిసినా మనం కొబ్బరిని తినడానికి ఇష్టపడం. ఒక్క కొబ్బరిబొండాం తాగితే ఒక గ్లూకోజ్ ఎక్కించుకున్న బలం చేకూరుతుంది.
కొబ్బరి బెల్లంలో కార్బోహైడ్రేడ్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని తరచుగా తీసుకుంటే శక్తి కలుగుతుంది. కీళ్లనొప్పులు దూరం చేస్తుంది. గర్భిణులు తీసుకుంటే ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ తగ్గుతాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఇతర రోగాలు రాకుండా అడ్డుకుంటాయి. గోరు వెచ్చని నీటిలో బెల్లం వేసుకుని తాగితే శ్వాస సంబంధిత రోగాలు రాకుండా పోతాయి. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇందులో ఉండే పొటాషియంతో బరువు తగ్గడానికి కారణమవుతుంది. శరీరంలో అవసరమైన దానికంటే ఎక్కువగా నీరు లేకుండా చేస్తుంది. కొబ్బరి బెల్లం క్రమం తప్పకుండా తీసుకుంటే ఎముకలు దృఢంగా మారతాయి.
Coconut And Jaggery Benefits
చాలా మంది కొబ్బరి తింటే దగ్గు వస్తుందని అపోహ పడుతుంటారు. అందులో నిజం లేదు. కొబ్బరి తింటే బలమే కానీ ఇతర ఏ రకమైన ఇబ్బందులు రావు. కొబ్బరి ఉండలు తింటే ఎన్నో రోగాల నుంచి ఉపశమనం కలుగుతుంది. కొబ్బరి బెల్లంలో ఉండే ప్రొటీన్లతో మన శరీరానికి ఎన్నో విధాల ప్రయోజనాలు ఉన్నాయి. పిల్లలకు తరచుగా కొబ్బరి ఉండలు ఇస్తుంటే వారిలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఫలితంగా తెలివితేటల్లో మంచి చురుకుగా తయారవుతారు. చదువులో ముందంజలో నిలుస్తారు. ఇన్ని లాభాలున్న కొబ్బరిని బెల్లంతో కలిపి తీసుకోవడం వల్ల మనకు దీర్ఘకాల వ్యాధుల నుంచి కూడా రక్షణ పొందవచ్చు.
0 Comments:
Post a Comment