CM Jagan: ఏపీలో ముందస్తు ఫిక్స్..! తాజా సీఎం వ్యాఖ్యల అర్థం అదేనా.. ఢిల్లీ పర్యటనలో ఏం జరిగింది..?
CM Jagan: ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh) రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకోనుందా..? ఎవరూ ఊహించని విధంగా వచ్చే నెలలో దీనిపై సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) ప్రకటన చేసే అవకాశం ఉందా..
ఢిల్లీ (Delhi) రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం ఇదే చర్చ జరుగుతోంది.. జనవరి నెలలోనే అసెంబ్లీ రద్దుపై సీఎం ప్రకటిస్తారని వార్త రాజకీయ వర్గాల్లో వైరల్ అవుతోంది. ముఖ్యంగా ఈ విషయంలో ప్రధాని మోదీ (PM Modi), అమిత్ షా (Amit Shah) లను ఒప్పించడంలో జగన్ సక్సెస్ అయ్యారు అంటున్నారు. మొన్న ఢిల్లీ పర్యటన వెనుక అసలు అజెండా అదే అంటున్నారు. చాలా రోజులుగా దీనిపై బీజేపీ పెద్దలను కలిసినా.. సానుకూల స్పందన రాలేదని.. కానీ తాజా పర్యటనలో జగన్ ప్రతిపాదనకు కేంద్ర పెద్దలు ఆంగీకరించినట్టు తెలుస్తోంది..
ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాతో ప్రత్యేకంగా సమావేశమైన సీఎం జగన్ మోహన్ రెడ్డి.. ఓ వైపు రాష్ట్ర సమస్యలు.. ఇతర నిధులు.. విభజన హామీలపై కాసేపు మాట్లాడిన తరువాత.. ముందస్తు ఎన్నికలకు వెళ్లాలి అనుకుంటున్నామని.. అందుకు కారణాలు కూడా వివరించినట్టు ఓ ప్రచారం జరుగుతోంది. అందుకు మోదీ కూడా సానుకూలంగా స్పందించారని తెలుస్తోంది.
అన్ని కుదిరినట్టు అయితే తెలంగాణలో ఎన్నికలతో పాటే ఏపీలో ఎన్నికలు ఉండే అవకాశం ఉందని.. లేదంటే అంతకన్నా ముందే దీనిపై ప్రకటన వచ్చే అవకాశం ఉంది అంటున్నారు.. 2024 వరకు అధికారంలో ఉండేందుకు అవకాశం ఉన్నా.. ఆయన ఎందుకు అసెంబ్లీని రద్దు చేయాలి అనుకుంటున్నారు అన్నదానిపై ప్రధానికి వివరణ ఇచ్చినట్టు టాక్..
ఇటీవల ఆయన పలు రకాలుగా సర్వే చేయించుకున్నారు. అందులో ఒకటి ఐ ప్యాక్ సర్వే కాగా.. మరొకటి వైసీపీ ఎంపీ పర్యవేక్షణలో ఓ ప్రైవేటు సంస్థ సర్వే చేసింది. అలాగే ప్రభుత్వ ఇంటెలిజన్స్ ద్వారా కూడా ఎప్పటి కప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నట్టు తెలుస్తోంది. ఆ నివేదికలను పూర్తిగా పరిశీలించిన తరువాత ఆయన ముందస్తుకు వెళ్లడమే మేలను భావించినట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం ప్రభుత్వంపై ప్రజల్లో పూర్తి నమ్మకం ఉందని.. కానీ ఒకవేళ టీడీపీ-జనసేన కలిసి ఎన్నికలకు వెళ్తే.. పరిస్థితి వేరేలా ఉండే అవకాశం ఉందని అంచనాకు వచ్చినట్టు టాక్.. అలాగే ప్రస్తుతం ఆర్థికంగానూ ఇబ్బందులు ఉన్నాయని.. అవి మరింత పెరిగే ప్రమాదం ఉందని.. ఆ సమస్యను అధిగమించాలి అంటే ముందస్తు వెళ్లడమే మంచిదని జగన్ భావిస్తున్నట్టు ప్రచారం ఉంది.
ప్రస్తుతానికి విపక్షాలు చేస్తున్నంత వ్యతిరేకత ప్రభుత్వంపై లేదని.. కానీ ఆర్థిక పరిస్థితులు సహకరించకపోయి.. కేంద్రం నుంచి నిధులు రాకపోతే.. ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఏడాదిలోపే ఎన్నికలకు వెళ్తే.. కచ్చితంగా గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నది జగన్ నమ్మకం అంటున్నారు. అంతేకాదు తాజాగా ఆయన నర్సీపట్నంలో మాట్లాడిన తీరు చూసినా.. పూర్తిగా ఎన్నికల మూడ్ లోకి వెళ్లినట్టే కనిపిస్తోంది.. అధికంగా రాజకీయాలపైనే ఫోకస్ చేశారు. చంద్రబాబు , పవన్ కళ్యాణ్ లను టార్గెట్ చేస్తూనే మాట్లాడారు.. అంతేకాదు ఎన్నికలకు అందరూ సిద్ధంగా ఉండాలని.. ప్రతి వైసీపీ కార్యకర్త కాలర్ ఎగరేసుకుని ప్రజల్లోకి వెళ్లి ఓట్లు అడగొచ్చు అన్నారు జగన్.. ఇప్పటికే పలుమార్లు గడప గపడకు ప్రభుత్వంపై సమీక్షలు నిర్వహించిన ఆయన.. జనవరి రెండో వారంలోపు మరో సమీక్ష నిర్వహించి.. ఆ వెంటనే అసెంబ్లీ రద్దుపై ప్రకటన చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది..
0 Comments:
Post a Comment