Cloves Tea: గొంతులో కఫం సమస్యను ఇట్టే కరిగించే అద్భుతమైన టీ
లవంగం అనేది ఒక మూలిక. ప్రతి భారతీయ కిచెన్లో తప్పకుండా ఉంటుంది. లవంగంతో వంటల రుచి పెరగడమే కాదు..ఆరోగ్యం కూడా బాగుపడుతుంది. ఇందులో ఉండే యాంటీ సెప్టిక్, యాంటీ వైరల్, యాంటీ మైక్రోబియల్ గుణాలు మెరుగైన ఆరోగ్యాన్ని అందిస్తాయి.
ముఖ్యంగా లవంగం టీ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది క్రమం తప్పకుండా తాగడం వల్ల జలుబు-దగ్గు, గొంతులో గరగర, ముక్కు దిబ్బడ వంటి సమస్యలు తృటిలో మాయమౌతాయి. అంతేకాకుండా కడుపులో సమస్య, స్వెల్లింగ్, కడుపులో తిప్పినట్టుండటం వంటి సమస్యలు కూడా తొలగిపోతాయి. కేవలం ఒక కప్పు లవంగం టీ తాగితే చాలు..గొంతులో కఫం సమస్య ఉంటే ఇట్టే కరిగిపోతుంది.
లవంగం టీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం..
లవంగం టీ తయారీకు 3 లవంగాలు, ఒక కప్పు నీరు అవసరమౌతాయి. ఓ గిన్నెలో ఓ కప్పు నీళ్లు తీసుకుని అందులో 3 లవంగాలు వేసి బాగా ఉడికించాలి. కనీసం 3-5 నిమిషాలు మరిగించిన తరువాత ఆపేయాలి. ఈ మిశ్రమాన్ని వడపోసి రుచి కోసం తేనె కొద్గిగా కలుపుకుని తాగవచ్చు.
0 Comments:
Post a Comment