Cinnamon Joint Pains Home Remedies In Telugu :
15 రోజులు తాగితే మోకాళ్ళనొప్పులు, కీళ్ళనొప్పులు, నడుమునొప్పి, అధిక బరువు అనేవి అసలు ఉండవు.
మారిన జీవనశైలి కారణంగా మనలో చాలా మంది ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతున్నారు. వాటిలో ముఖ్యంగా అధిక బరువు, కీళ్ళనొప్పులు, మోకాళ్ళ నొప్పులు వంటి వాటితో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు.
ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమస్యతో బాధపడుతూనే ఉన్నారు.
ముఖ్యంగా calcium లోపంతో బాధపడుతున్నారు. calcium లోపం ఉన్నప్పుడు శారీరక బలహీనత, అలసట, కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు వంటివి వస్తూ ఉంటాయి. ఒకప్పుడు 50 నుంచి 60 సంవత్సరాలు వచ్చాక ఇటువంటి సమస్యలు వచ్చేవి.కానీ ఇప్పుడు చిన్న వయసులోనే వచ్చేస్తున్నాయి. calcium లోపాన్ని అసలు అశ్రద్ధ చేయకూడదు.
ఈ రోజు ఈ లోపాన్ని సరి చేసుకోవడానికి ఒక మంచి చిట్కా తెలుసుకొందాం. ఈ చిట్కా చాలా బాగా సహాయపడుతుంది. దీని కోసం పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాస్ నీటిని పోసి దానిలో దాల్చిన చెక్క ముక్క, ఒక యాలకులు, అరస్పూన్ సొంపు, పావుస్పూన్ పసుపు వేసి 5 నిమిషాల పాటు మరిగించాలి. ఆ తర్వాత పావు స్పూన్ బెల్లం వేసి 2 నిమిషాలు మరిగించి వడకట్టి ఉదయం సమయంలో తాగాలి.
ఉదయం సమయంలో కుదరని వారు సాయంత్రం సమయంలో అయినా తాగవచ్చు. ఈ డ్రింక్ గోరువెచ్చగా ఉన్నప్పుడూ తాగాలి. ఈ విధంగా 15 రోజుల పాటు తాగితే మంచి ప్రయోజనం కనపడుతుంది. డయబెటిస్ ఉన్నవారు బెల్లం లేకుండా డ్రింక్ తయారుచేసుకోవాలి. ఈ డ్రింక్ లో ఉపయోగించిన అన్ని ఇంగ్రిడియన్స్ లో ఉన్న పోషకాలు నొప్పులను తగ్గిస్తాయి.
అలాగే అధిక బరువు ఉన్నవారు ఉదయం సమయంలో పరగడుపున తాగితే చాలా మంచి ప్రయోజనం కనపడుతుంది. అయితే గ్యాస్ సమస్య ఉన్నవారు పరగడుపున తాగకూడదు. గ్యాస్ సమస్య ఉన్నవారు బ్రేక్ ఫాస్ట్ చేసిన అరగంట తర్వాత తాగాలి. ఈ డ్రింక్ ని క్రమం తప్పకుండా ప్రతి రోజు తాగితే మంచి పలితాలను పొందవచ్చు. కాస్త సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది.
0 Comments:
Post a Comment