Chittoor Nagayya: సినీ రంగంలో ఏ కాలంలో అయినా సరే భారీ పాపులారిటీ దక్కించుకున్న హీరోలకు మాత్రమే ఎక్కువ పారితోషకం ఇచ్చేవారు.
కానీ ఎన్టీఆర్, ఏఎన్నార్ లను కాదని ఆ నటుడికి ఏకంగా లక్ష రూపాయల పారితోషకం ఇవ్వడం అప్పట్లో ఇండస్ట్రీలోనే హాట్ టాపిక్ గా మారింది.. అసలు విషయంలోకి వెళితే సినీ పరిశ్రమకి సీనియర్ ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు చేసిన సేవలు మరువలేనివి.. అంతేకాదు వీరిద్దరూ సాధించిన సంచలన రికార్డులను నేటితరం హీరోలు బ్రేక్ చేయడం సాధ్యం కాదని కూడా కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఇటీవల కృష్ణ (Krishna) మేకప్ మెన్ మాధవరావు (Madhavarao) ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సినీ పరిశ్రమకు చెందిన ఎన్నో విషయాలను వెల్లడించారు..
1956లో ఇండస్ట్రీకి వచ్చిన పౌరాణిక చిత్రాలకు మేకప్ అంటే అనుభవం ఉండాలని.. అప్పుడే తాను తెలుసుకున్నట్లు మాధవరావు తెలిపారు.
ఆ కాలంలో రోజుకి మూడు రూపాయల చొప్పున రెమ్యునరేషన్ ఇచ్చేవారు అని.. హీరోలకి కూడా 3000 రూపాయల రెమ్యునరేషన్ ఉండేది అని మాధవరావు తెలిపారు.
కానీ అలాంటి సమయంలోనే ఎన్టీఆర్(NTR), ఏఎన్ఆర్(ANR) ను కాదని హీరో చిత్తూరు నాగయ్య లక్ష రూపాయలు పారితోషకం తీసుకున్నారు అని మాధవరావు వెల్లడించారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ తీసుకున్న పారితోషకం కంటే ఈయన పారితోషకం చాలా ఎక్కువగా ఉండేది అని మాధవరావు వెల్లడించారు.
ఇకపోతే సీనియర్ ఎన్టీఆర్ తో పరువు ప్రతిష్ట సినిమాకు మేకప్ మెన్ గా పని చేశానని తెలిపిన మాధవరావు.. ప్రయోగాల విషయంలో కృష్ణ ముందుండేవారు అని కామెంట్లు చేశారు.
సాధారణంగా ఏ హీరో కూడా మేకప్ మాన్ లను రిపీట్ చేయలేదు.. అయితే కృష్ణ గారు మాత్రం తనను చాలా సార్లు రిపీట్ చేశారు అని వెల్లడించారు . నాటకాల నుంచే కృష్ణ గారితో పరిచయం ఏర్పడడం వల్లే ఇది సాధ్యమైంది అని కూడా తెలిపారు
ఇకపోతే సాక్షి సినిమాకు కృష్ణ గారికి, విజయనిర్మల(Vijayanirmala) గారికి మేకప్ మేన్ గా పని చేశాను అని , నేను నాచురల్ మేకప్ కు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం వల్లే సినిమాలలో అవకాశాలు వచ్చాయని కూడా మాధవరావు తెలిపారు. ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
0 Comments:
Post a Comment