Child Stuck in Lift: లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన బాలుడు.. డోర్ ఓపెన్ కాకపోవడంతో ఏం చేశాడో చూడండి
Child Stuck In Lift Cctv Video: గ్రేటర్ నోయిడాలోని నిరాలా ఆస్పైర్ సొసైటీ లిఫ్ట్‌లో చిన్నారి ఇరుక్కున్న సీసీటీవీ ఫుటేజీ వెలుగులోకి వచ్చింది.
శుక్రవారం జరిగిన ఈ ఘటన నెట్టింట వైరల్ అవుతోంది. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 14వ అంతస్తు నుంచి ఇంటికి వెళ్తున్న ఎనిమిదేళ్ల చిన్నారి నాలుగో, ఐదో అంతస్తు మధ్య దాదాపు 10 నిమిషాల పాటు లిఫ్ట్‌లో ఇరుక్కుపోయాడు. అకస్మాత్తుగా లిఫ్ట్ ఆగిపోవడంతో.. మొదట ఎమర్జెన్సీ బటన్‌ను నొక్కి, లిఫ్ట్ తలుపును కొట్టాడు. ఆ తరువాత అసహనంతో గట్టిగా అరుస్తూ.. ఏడుపు అందుకున్నాడు.
ఈ ఘటన మొత్తం లిఫ్ట్‌లోని సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. గ్రేటర్ నోయిడా వెస్ట్‌లోని బిసార్ఖ్ ప్రాంతంలోని నిరాలా ఆస్పైర్ సొసైటీలో ఓ బాలుడు తన సైకిల్‌తో లిఫ్ట్‌లోకి ఎక్కాడు. తను వెళ్లాల్సిన ఫ్లోర్ బటన్ ప్రెస్ చేసి.. కాసేపు సైకిల్‌పై ఎక్కేందుకు ప్రయత్నించాడు. మళ్లీ కిందకు దిగి నిల్చున్నాడు. ఆ తరువాత లిఫ్ట్ ఆగిపోవడంతో ఏమైందోనని కంగారు పడిపోయాడు.
ఆ తరువాత లిఫ్ట్ డోర్ మొదటి డోర్ మెల్లిగా ఓపెన్ చేసుకోగా.. చేతులతో దూరంగా లాగాడు. రెండో డోర్ ఓపెన్ కాకడంతో చేతితో బద్దలు కొట్టేందుకు ప్రయత్నించాడు. రాకపోవడంతో వెంటనే ఎమర్జెన్సీ బటన్ ప్రెస్ చేశాడు. అయినా డోర్ ఓపెన్ కాకపోవడంతో సైకిల్‌తో లిఫ్ట్‌కు ఢీకొట్టాడు. సాయం కోసం గట్టిగా అరుస్తూ.. ఒక్కసారిగా ఏడ్చాడు. బాలుడు అరుపులు విన్న ఓ వ్యక్తి వచ్చి.. లిఫ్ట్ డోర్ ఓపెన్ చేసి రక్షించాడు. దాదాపు 10 నిమిషాల పాటు బాలుడు లిఫ్ట్‌లో ఇరుక్కుపోయాడు.
0 Comments:
Post a Comment