Child stress - ఇవి తింటే పిల్లలపై చదువుల ఒత్తిడి మాయం.
పిల్లలకు చదువులు, పరీక్షల ఒత్తిడి కలగకుండా ఉండేందుకు మంచి ఉపాయం ఉంది.
ప్రతిరోజూ ఏ పిల్లలైతే వాల్‌నట్స్ తింటారో వారి మానసిక ఆరోగ్యం గట్టిగా ఉంటుందని, వారు ఒత్తిడి బారిన పడరని చెబుతున్నారు పరిశోధకులు.
పరీక్షల సమయంలో విద్యార్థుల్లో ఒత్తిడి, నిరాశ అధికంగా ఉన్నట్టు ఓ నివేదికలో చెప్పారు అధ్యయనకర్తలు.
పిల్లలకు రోజూ రాత్రి నానబెట్టిన వాల్‌నట్స్ ఉదయం తినిపించాలి.
వీటిలో ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, ఆల్ఫా లినోలియిక్ యాసిడ్, ఫైబర్, కాపర్, యాంటీ ఆక్సిడెంట్లు, కాపర్, బయోటిన్ వంటి ఎన్నో పోషకాలు ఇందులో ఉన్నాయి.
ముఖ్యంగా పరీక్షల సమయంలో వాల్ నట్స్ కచ్చితంగా తినపించాలి.
చదివింది గుర్తుండేలా, మెదడుకు చాలా సహాయపడతాయివి.
0 Comments:
Post a Comment