చాణక్య విధానం ఒక జ్ఞాన భాండాగారం. ఆచార్య తన జీవితంలోని ప్రతి లక్ష్యాన్ని ఖచ్చితమైన ప్రణాళికతో నెరవేర్చేవారు. చాణక్య విధానాలు ఎంతో మంది జీవితాలను మార్చేశాయి.
వ్యక్తి విజయానికి, వైఫల్యానికి అతని చర్యలే కారణమని చాణక్యుడు చెప్పాడు. సమాజలో గౌరవం పొందడానికి సంవత్సరాలు పడుతుంది. కానీ ఒక్క తప్పుచేస్తే అమాతం అగౌరవం పాలవుతారు.
అందుకే ఒక విషయంలో ఎప్పటికీ రాజీపడకూడదని చాణక్యుడు చెప్పాడు, ఎంతటి దుర్భర పరిస్థితులు ఎదురైనా ఈ ఒక్క విషయాన్ని పణంగా పెట్టామంటే.. సంబంధాలు, గౌరవం, అన్నీ క్షణాల్లో పోతాయి. ఏళ్ల తరబడి కష్టపడి సంపాదించుకున్న గౌరవం మట్టికొట్టుకుపోతుంది. జీవితంపై మచ్చ ఏర్పడుతుంది.
ఆత్మగౌరవం అనేది మనిషికున్న మూలధనం. మనిషి దానిని చనిపోయే వరకు కాపాడుకుంటాడు. మీ ఆత్మగౌరవం దెబ్బతినని చోట మాత్రమే ఎవరికైనా నమస్కరించండి అని చాణక్యుడు చెప్పాడు.
మీరు మీ ఉనికిని పణంగా పెడితే, మీకు చెడ్డపేరు వస్తుంది. అది చెరిపేద్దామనుకున్నా తొలగిపోదు. జీవితంలో ఆత్మగౌరవం విషయంలో రాజీ పడకూడదని చాణక్య తెలిపారు.
తన ఆత్మగౌరవంపై దృఢంగా నిలబడే వ్యక్తిని బాధలు చుట్టుముట్టవని చాణక్యుడు చెప్పాడు. ఆత్మగౌరవంతో రాజీపడి జీవితాన్ని గడపడం బాధాకరంగా మారుతుంది.
వ్యక్తి మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా బలహీనంగా ఉన్నప్పుడు ఆత్మగౌరవం విషయంలో రాజీపడవలసిన అవసరం వస్తుంది.
అటువంటప్పుడు కూడా ఆత్మగౌరవం నిలబెట్టుకున్నవారే నిజమైన మనిషి అని చాణక్య తెలిపారు.
0 Comments:
Post a Comment