Cardamom : రోజూ రాత్రి పడుకునే ముందు రెండు యాలకులను తిని గోరు వెచ్చని నీటిని తాగితే ఏం జరుగుతుందో తెలుసా..?
Cardamom : చక్కటి వాసనను కలిగి ఉండే సుగంధ ద్రవ్యాల్లో యాలకులు ఒకటి. ఇవి మనందరకి తెలిసినవే. వీటిని ఎక్కువగా తీపి వంటకాల్లో సువాసన కోరకు ఉపయోగిస్తూ ఉంటాం.
ఈ యాలకుల్లో చక్కటి వాసనతో పాటు ఔషధ గుణాలు, ఆరోగ్య ప్రయోజనాలు కూడా దాగి ఉన్నాయి. యాలకుల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిస్తే మనం ఖచ్చితంగా ఆశ్చర్యపోవాల్సిందే. రోజూ పరగడుపున రెండు యాలకులను తిని గోరు వెచ్చని నీటిని తాగడం వల్ల మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఇలా తీసుకోవడం వల్ల మనకు మందులతో అవసరమే ఉండదని నిపుణులు చెబుతున్నారు. ఉదయం లేదా రాత్రి పడుకునే ముందు యాలకులను తిని గోరు వెచ్చని నీటిని తాగడం వల్ల అధిక బరువు సమస్య నుండి చాలా సులభంగా బయటపడవచ్చు.
అధిక బరువు సమస్య కారణంగా మనకు ఇతర అనారోగ్య సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. అధిక బరువు కారణంగా బాధపడే వారు ఇలా యాలకులను తీసుకోవడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా బరువు తగ్గవచ్చు. ఈ విధంగా యాలకులను తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన వ్యర్థ పదార్థాలన్నీ తొలగిపోతాయి. రక్తప్రసరణ వ్యవస్థ మెరుగుపడుతుంది. శరీరంలోని అవయావాలన్ని శుబ్రపడతాయి. అలాగే యాలకులకు జీర్ణసంబంధిత సమస్యలను తగ్గించే శక్తి కూడా ఉంది.
Cardamom
గ్యాస్, అజీర్తి, కడుపు ఉబ్బరం, మలబద్దకం వంటి సమస్యలతో బాధపడే వారు మనలో చాలా మంది ఉంఏ ఉంటారు. అలాంటి వారు యాలకులను తిని గోరు వెచ్చని తాగడం వల్ల ఆయా సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. నిద్రలేమి సమస్యతో బాధపడే వారు యాలకులను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఉదయం పూట ఇలా యాలకులను తిని గోరు వెచ్చని నీటిని తాగడం వల్ల మూత్రపిండాల్లో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగడంతో పాటు మూత్రాశయ సమస్యలు కూడా తగ్గు ముఖం పడతాయి. రక్తహీనతతో బాధపడే వారికి యాలకులు చక్కటి ఔషధంగా చెప్పవచ్చు. యాలకులను తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్య తగ్గడంతో పాటు రక్తహీనత వల్ల కలిగే నీరసం, నిస్సత్తువ వంటి సమస్యలు కూడా తగ్గుతాయి.
యాలకును బాగా నమిలి మింగి గోరు వెచ్చని నీటిని తాగడం వల్ల దంతాల సమస్యలు తొలగిపోతాయి. నీటిలో యాలకులను, దాల్చిన చెక్క పొడిని వేసి మరిగించాలి. ఈ నీటిని గొంతులో పోసుకుని పుక్కిలించడం వల్ల గొంతు సంబంధిత సమస్యలు తగ్గుతాయి. చిన్నవే అయిన యాలకులు మనకు ఎంతో మేలు చేస్తాయని వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యం ఎంతగానో మెరుగుపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
0 Comments:
Post a Comment