Cancer - క్యాన్సర్ కణాల రహస్యాన్ని కనుగొన్న పరిశోధకులు...
ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏటా ఎంతోమంది ప్రాణాంతక క్యాన్సర్ బారీనపడి తనువుచాలిస్తున్నారు. శాస్త్రవేత్తలు ఈ మహమ్మారి మూలలను గురించి మరింతలోతుగా తెలుసుకునేందుకు సరోకొత్త పరోశోధన చేశారు.తొంబై శాతం క్యాన్సర్ మరణాలకు కారణమైన మెటాస్టాసిస్ను ఆపడానికి, క్యాన్సర్ కణాలను శరీరమంతా వ్యాప్తి చేయడానికి అనుమతించే ఒక వ్యవస్థను అంతర్జాతీయ పరిశోధకుల బృందం కనుగొంది.
"ఎక్స్ట్రాసెల్యులర్ ద్రవం స్నిగ్ధతను వివరంగా పరిశీలించడం ఇదే మొదటి సారి" అని అల్బెర్టా యూనివర్శిటీ ఫ్యాకల్టీ ఆఫ్ మెడిసిన్ , డెంటిస్ట్రీలో ట్రాన్స్లేషనల్ ఆంకాలజీలో ప్రొఫెసర్, బర్డ్ డాగ్స్ చైర్ అయిన జాన్ డీ లూయిస్ చెప్పారు.
"ఫ్లూయిడ్ స్నిగ్ధత క్యాన్సర్ కణాలను నిర్దిష్ట మార్గంలో తరలించడానికి సంకేతాలు ఇస్తుందని తెలుసుకోగలిగాం" అని పేర్కొన్నారు.
సిగ్నలింగ్ మార్గాన్ని ప్రాథమికంగా షార్ట్-సర్క్యూట్ చేయడానికి , క్యాన్సర్ కణాలను నెమ్మదింప చేయడానికి లేదా ఆపడానికి కూడా మందులను ఉపయోగించవచ్చు." అని జాన్ డీ లూయిస్ తెలిపారు. ఒకసారి కొత్త చికిత్సా లక్ష్యాన్ని గుర్తించినట్లయితే, ఔషధాన్ని అభివృద్ధి చేయడానికి ,పరీక్షించడానికి 10 నుంచి15 సంవత్సరాలు పట్టవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.
0 Comments:
Post a Comment