Calcium Rich Foods: ప్రతి రోజూ చలి కాలంలో ఇలా పాలు తాగితే.. అన్ని రకాల అనారోగ్య సమస్యలకు చెక్..
Calcium Rich Foods: పాలలో బాడికీ కావాల్సిన అన్ని రకాల పోషకాలు లభిస్తాయి. అందుకు దీనిని సంపూర్ణ ఆహారంగా భావిస్తారు. అందుకే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి ఆరోగ్య నిపుణులు పాలు తాగమని సూచిస్తారు.
అయితే ఎముకల సమస్యలతో బాధపడుతున్నవారికి క్యాల్షియం అధిక పరిమాణంలో లభించే పాలు ప్రభావవంతంగా సహాయపడతాయి. ప్రస్తుతం ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దీనికి ప్రధాన కారణాలు క్యాల్షియం లోపమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా పలు రకాల ఆహారాలు తీసుకోవడం వల్ల కూడా ఈ క్యాల్షియం సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందవచ్చు.
పాలు కాకుండా కాల్షియం లభించే ఆహారాలు ఇవే:
1. ఆరెంజ్:
ఆరెంజ్ పండ్లు శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను చేకూర్చుతాయి. అంతేకాకుండా ఇందులో ఉండే పోషకాలు శరీర రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అంతేకాకుండా శరీరంలో కాల్షియం లోపాన్ని తగ్గించడానికి ఆరెంజ్ పండ్లను ప్రతి రోజూ తీసుకోవాల్సి ఉంటుంది.
2. ఓట్స్:
బరువు తగ్గడానికి ఓట్స్ ప్రభావవంతగా సహాయపడతాయి. అయితే వీటిని అల్పాహారంలో తీసుకునే శరీరానికి క్యాల్షియం పుష్కలంగా లభిస్తుంది. కాబట్టి తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఓట్స్‌ను తీసుకోవాల్సి ఉంటుంది. పాలతో పాటు ఓట్స్ తీసుకుంటే శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా శరీరాన్ని అనారోగ్య సమస్యల నుంచి రక్షిస్తుంది.
3. సూర్యరశ్మి:
విటమిన్ డి పొందడానికి ప్రతి రోజూ సూర్యరశ్మి ముందు నిలబడతారు. అయితే ఇలా చేయడం వల్ల విటమిన్ డి అందడమేకాకుండా.. కాల్షియం పుష్కలంగా అందుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి తప్పకుండా ప్రతి రోజూ సూర్యరశ్మి ముందు ఉండండి.
4. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్:
గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ కూడా శరీరానికి చాలా మంచివి. ఇందులో ఉండే గుణాలు శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను కలిగిస్తాయి. ముఖ్యంగా మధుమేహంతో బాధపడుతున్నవారికి ఈ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ప్రభావవంతంగా పని చేస్తాయి. కాబట్టి వీటిని ప్రతి రోజూ ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది. వీటిని తీసుకోవాడం వల్ల శరీరానికి పోషకాలతో పాటు, కాల్షియం కూడా లభిస్తుంది.
0 Comments:
Post a Comment