Buddie 25: తక్కువ ధరలో మార్కెట్‌లోకి కొత్త ఎలక్ట్రిక్ బైక్.. రూ.999తో బుక్ చేసుకోండిలా!
Electric Vehicles | మార్కెట్‌లోకి కొత్త ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసింది. నాసిక్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న రీవ్యాంప్ మోటో కంపెనీ తాజాగా ఈ ఎలక్ట్రిక్ బైక్‌ను (Bike) మార్కెట్‌లో లాంచ్ చేసింది.
దీని పేరు బుడ్డీ 25. తక్కువ ధరలోనే ఇది మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. దీని ఎక్స్‌షోరూమ్ రేటు రూ. 66,999. ఈ ఎలక్ట్రిక్ బైక్‌ను కేవలం రూ. 999తో బుక్ చేసుకోవచ్చు. 2023 ఏప్రిల్ నుంచి ఈ ఎలక్ట్రిక్ బైక్ (Electric Bike) డెలివరీ ప్రారంభం అవుతుంది.
మహరాష్ట్రలోని థానే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌లో ఈ బైక్ తయారు అవుతోంది. కస్టమర్లు ఈజీ ఫైనాన్స్ ఆప్షన్స్‌తో ఈ ఎలక్ట్రిక్ బైక్‌ను కొనొచ్చు. నో కాస్ట్ ఈఎంఐ కూడా ఉంది. ఇన్‌స్టంట్ లోన్ పొందొచ్చు. రీవ్యాంప్ మోటో బుడ్డీ 25 ఎలక్ట్రిక్ బైక్‌లో 48వీ, 25 ఏహెచ్ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఒక్కసారి చార్జింగ్ పెడితే 75 కిలోమీటర్ల వరకు పోవచ్చు. ఈ ఎలక్ట్రిక్ బైక్ టాప్ స్పీడ్ గంటకు 25 కిలోమీటర్లు.
అంటే ఈ ఎలక్ట్రిక్ బైక్‌కు ఎలాంటి రిజిస్ట్రేషన్ అవసరం లేదు. అలాగే మీకు డ్రైవ్ చేయడానికి డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండక్కర్లేదు. బ్యాటరీ 45 నిమిషాల్లోనే 80 శాతం వరకు చార్జ్ అవుతుంది. ఈ ఎలక్ట్రిక్ బైక్‌పై 120 కేజీల వరకు బరువు ఎత్తుకు పోవచ్చు. స్వాపబుల్ బ్యాటరీ ఫీచర్ ఉంది. చైల్డ్ సీట్, శాడల్ స్టే, శాడల్ బ్యాగ్స్, ఇన్సులేటెడ్ బాక్స్, క్యారియర్, బేస్ ప్లేట్, బేస్ ర్యాక్ వంటివి అన్నీ ఉంటాయి. ఇది దేశీ తొలి ట్రాన్స్‌ఫర్మబుల్ ఎలక్ట్రిక్ వెహికల్ అని కంపెనీ పేర్కొంటోంది. అంతేకాకుండా ఈ ఎలక్ట్రిక్ బైక్ స్మార్ట్‌ఫోన్‌తో కనెక్ట్ చేసుకోవచ్చు. బైక్ ఎక్కడ ఉంది? ఇంకా ఎంత రేంజ్ వెళ్లొచ్చు వంటి పలు రకాల ఫెసిలిటీస్‌ను ఈ యాప్ ద్వారా పొందొచ్చు.
ఈ బైక్ మాడ్యులర్ యూటిలిటీ ప్లాట్‌ఫామ్‌పై రూపొందిందని తెలిపింది. అందువల్ల అవసరమైన అటాచ్‌మెంట్లను కేవలం 30 సెకన్లలోనే యాడ్ చేసుకోవచ్చని వివరించింది. కాగా ఈ ఎలక్ట్రిక్ బైక్ ఫుల్‌గా చార్జ్ కావాలంటే 2 గంటల 45 నిమిషాలు టైమ్ పడుతుంది. ఇకపోతే ఈ ఎలక్ట్రిక్ బైక్ కొనుగోలు చేయాలని భావించే వారు కంపెనీ వెబ్‌సైట్‌లోకి ముందుగానే బైక్‌ను రిజర్వు చేసుకోవాల్సి ఉంటుంది. మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడీ వంటి వాటిని ఎంటర్ చేయాల్సి వస్తుంది. రూ.999 కట్టి బైక్‌ను ప్రి బుకింగ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ డబ్బులు పూర్తిగా రిఫండ్ చేస్తారు.
0 Comments:
Post a Comment