BRS కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీపై కొత్త కిరికిరి!!
టిఆర్ఎస్ పార్టీ పేరు బీఆర్ఎస్ పార్టీ గా మారుతుందని, త్వరలో ఎన్నికల కమీషన్ బీఆర్ఎస్ పై ప్రకటన ఇచ్చే అవకాశముందని టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తో పాటు, పార్టీ శ్రేణులంతా ఎదురుచూస్తుంటే, ఊహించని విధంగా కెసిఆర్ బీఆర్ఎస్ పార్టీ పై కొత్త లొల్లి వచ్చిపడింది.
బీఆర్ఎస్ పార్టీ తనకే కేటాయించాలంటున్న యువకుడు
కేంద్ర ఎన్నికల సంఘం బీఆర్ఎస్ పార్టీ కి అనుమతిస్తే అది తనకు ఇవ్వాలని వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గానికి చెందిన ఒక యువకుడు డిమాండ్ చేస్తున్నాడు. తను భారతీయ రాష్ట్ర సమితి.. ఈ పేరు తనకి కేటాయించాలని సెప్టెంబర్ 5వ తేదీన కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకున్నానని బానోతు ప్రేమ్ గాంధీ నాయక్ అనే యువకుడు ఆధారాలతో సహా పేర్కొంటున్నాడు. టిఆర్ఎస్ పార్టీ పేరును మార్పు చేసి కేంద్ర ఎన్నికల సంఘం బీఆర్ఎస్ పార్టీగా ఎప్పుడైనా ప్రకటన చేసే అవకాశం ఉందని చర్చ జరుగుతున్న సమయంలో కొత్త వివాదం వచ్చి పడింది.
ఎన్నికల కమీషన్ కు బీఆర్ఎస్ విషయంలో యువకుడి ఫిర్యాదు
ఆ పేరు కావాలని ముందు దరఖాస్తు చేసుకుంది తానేనని, ఎలక్షన్ కమిషన్ ఆ పేరును తన కేటాయించాలని యువకుడు బానోతు ప్రేమ్ గాంధీ నాయక్ మరోమారు ఎలక్షన్ కమిషన్ కు లేఖ రాశారు. టిఆర్ఎస్ పార్టీ పేరును బీఆర్ఎస్ గా మారుస్తూ సీఎం కేసీఆర్ దసరా రోజున ప్రకటన చేసి చేసి ఆ తీర్మానం కాపీని కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించారు. ఇక పార్టీ పేరు మార్పు పై అభ్యంతరాలు కూడా ఈనెల ఆరో తారీకు తో ముగిసాయి. అంతా సజావుగా జరిగింది. టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారుతుంది అని భావించిన సమయంలో ప్రేమ గాంధీ నాయక్ అభ్యంతరం వ్యక్తం చేశాడు.
ముందు దరఖాస్తు చేసుకున్న తనకే బీఆర్ఎస్ కేటాయించాలని
అయితే తాను సెప్టెంబర్ 5వ తేదీన కేంద్ర ఎన్నికల సంఘానికి తనకు భారతీయ రాష్ట్ర సమితి పార్టీ పేరును కేటాయించాలని లేఖ రాశానని, టిఆర్ఎస్ పార్టీ కంటే ముందే తాను ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకున్నానని ఫస్ట్ కమ్ .. ఫస్ట్ గెట్ విధానంలో బీఆర్ఎస్ పార్టీ పేరును తనకే ఇవ్వాలంటూ మరియు ఎలక్షన్ కమిషన్ కు ఈ నెల 6వ తేదీన మళ్ళీ లేఖ రాశారు. గతంలో తాను దరఖాస్తు చేసుకున్న అప్లికేషన్ ఫామ్ ను కోట్ చేస్తూ లేఖ రాసి పంపారు.
లేదంటే న్యాయపోతనం చేస్తానన్న యువకుడు
లెక్కప్రకారం తనకే బి ఆర్ ఎస్ పేరును కేటాయించాలని, అలా కేటాయించక పోతే తాను న్యాయపోరాటం చేస్తానని ప్రేమ్ నాయక్ తేల్చి చెబుతున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుంటుందా? సదరు యువకుడు కోరినట్టు పార్టీ గుర్తును కేటాయించే అవకాశం ఉందా? ఒకవేళ బిఆర్ఎస్ ఫై ప్రకటన చేయాలి అంటే ఎప్పటిలోగా చేస్తుంది వంటి అనేక ప్రశ్నలకు సమాధానం తెలియాల్సి ఉంది.
0 Comments:
Post a Comment