కచ్చితంగా బ్రేక్ ఫాస్ట్ తినాలి, ప్రతిరోజూ అల్పాహారం స్కిప్ చేయడం వల్ల సమస్యలు వస్తాయి అని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. ఇప్పుడు రోజులో ముఖ్యమైన భోజనంగా మారిపోయింది బ్రేక్ ఫాస్ట్.
కానీ ఒకప్పుడు మనదేశంలో అల్పాహారం అనే కాన్సెప్ట్ లేదు.ఇది పాశ్చాత్య దేశాల నుంచి మనకు వచ్చింది.
ఒకప్పుడు భారతదేశంలో ఉదయం భోజనం చేయడం ఉండేది కాదు. నేరుగా మధ్యాహ్నం భోజనాన్నే తినవారు. అది కూడా ఇప్పటిలా ఒంటిగంట, రెండు గంటల సమయంలో కాకుండా పదకొండు గంటలకే తినేసే వారు. అదే అల్పాహారం, అదే మధ్యాహ్న భోజనం.
అంటే అప్పట్లో రోజుకు మూడు పూటలు కాదు, రెండు పూటలే తినేవారు. అప్పట్లో జనాభాలో ప్రధానంగా రైతులే ఉండేవారు. ఉదయం పూట పొలం పనికి వెళ్లిన రైతులు, కాసేపు పనిచేసుకున్నాక నేరుగా మధ్యాహ్న భోజనాన్ని తినేవారు. ఇదే వారికి సులువుగా ఉండేది. తలమీద పెట్టుకున్న గంపల్లో అన్నం మూటలు, కూరలు కట్టుకుని వెళ్లేవారు.
ఎప్పుడు మొదలైంది?
ఎప్పుడైతే మన దేశానికి విదేశీయుల రాకపోకలు పెరిగాయో, ఇక్కడ వేష భాషల్లో, ఆహారపు అలవాట్లలో మార్పులు రావడం మొదలయ్యాయి. కేవలం పొలాల్లో పనిచేసుకునే వారే కాదు, ఇతర ఉపాధి అవకాశాలు పుట్టుకొచ్చాయి.
17వ శతాబ్ధంలో కాఫీ, టీ, చాక్లెట్లు అధికంగా వినయోగించడం విదేశాల్లో మొదలైంది. ఈస్టిండియా కంపెనీ వారు భారతదేశాన్ని పాలించేటప్పుడు వారికి తగ్గట్టు ఆహారపు అలవాట్లను మార్చారు. తమకు అల్పాహారం వండి పెట్టాలని భారత వంటగాళ్లను ఆదేశించేవారు.
అలా ఉదయం బ్రేక్ ఫాస్ట్ తినాలన్న భావన భారతీయుల్లో మొదలైంది. ముఖ్యంగా పిల్లలకు, గర్భిణులకు, బాలింతలకు, ముసలి వారికి ఉదయం అల్పాహారం తినడం వల్ల రోజంతా శక్తిమంతంగా అనిపించేది.
దీంతో అందరూ తినడం మొదలుపెట్టారు. 19వ శతాబ్ధం నుంచే అల్పాహారం తినడం భారతీయులు మొదలుపెట్టారని అంటారు చరిత్రకారులు.
ఏం తినాలి?
ఉదయం పూట బ్రిటిష్ వారు బ్రెడ్, టీ,కాఫీ ఇలా లైట్‌గా తినేవారు. భారతీయులకు అప్పట్లో బ్రెడ్ రుచి అంతగా ఆకట్టుకోలేదు. చివరికి సొంతంగా అల్పాహారాలను సృష్టించడం ప్రారంభించారు.
ఉత్తరాదిలో పోహా, పరాతా, పూరీ సబ్జీ, చోలే భాతురే, ధోక్లా, చీలా ఇవన్నీ పుట్టుకొచ్చాయి. ఇక దక్షిణాదిలో అల్పాహారం అనగానే కనిపించేవి ఇడ్లీ, దోశె, వడ, ఉప్మా. వీటిని ఉదయానే తినడం రోజంతా శరీరానికి శక్తి అందుతుంది. అందుకే
News Reels
కార్న్‌ఫ్లేక్స్, వోట్స్
విదేశాల నుంచి ఇప్పటికే ఎన్న రకాల బ్రేక్ ఫాస్ట్ ఐడియాలు భారతదేశానికి ప్రయాణిస్తున్నాయి. కార్న్ ఫ్లేక్స్, ఓట్స్ వంటివి ముఖ్యంగా ఆ జాబితాలో ఉన్నాయి.
వీటిని పెద్దగా కష్టపడి వండక్కర్లేదు. చాలా సులువుగా అయిపోవడం, బరువు పెరగకపోవడం వంటి కారణాల ఇవి ప్రజాదరణ పొందాయి.
0 Comments:
Post a Comment