Boppayi బొప్పాయితో ఆ రెండు ప్రాణాంతక వ్యాధులకు చెక్
ఇంట్లో మనకు ఉండే ఎన్నో అనారోగ్య సమస్యలకు పండు లేదా ఏదైనా పదార్థం లేదా పప్పు దినుసుల రూపంలో ఔషదం ఉంటుంది. మనం వాటిని గుర్తించి ఉపయోగించినట్లయ్యితే ముందు ముందు ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. మన రెగ్యులర్ గా చూసే బొప్పాయి కాయల వల్ల ఎన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయో మీకు తెలుసా.. బొప్పాయి రెగ్యులర్ గా కాకుండా అప్పుడప్పుడు తినే వారికి కూడా చాలా అనారోగ్య సమస్యలకు పరిస్కారం దక్కుతుందని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా బొప్పాయి వల్ల రెండు ప్రయోజనాలు ఉంటాయని చెబుతున్నారు. మొదటిది లివర్ సమస్యల నుండి బొప్పాయి కాపాడుతుంది.
ఆల్కాహాల్ ఎక్కువ తాగడం వల్ల లివర్ చెడిపోవడం లేదా స్మోకింగ్ అధికంగా చేయడం వల్ల లివర్ చెడి పోవడం జరుగుతుంది.
లివర్ పూర్తిగా చెడిపోక ముందే క్రమం తప్పకుండా ఒక కప్పు బొప్పాయి ముక్కలను లేదా బొప్పాయి జ్యూస్ ను తీసుకోవాలి. ఇలా కనీసం రెండున్నర నుండి మూడు నెలలు బొప్పాయి ముక్కలు తినడం వల్ల లివర్ సగం వరకు క్లీన్ అయినట్లే అంటున్నారు. ఇక బొప్పాయి వల్ల మరో అద్బుత ప్రయోజనం ఏంటీ అంటే ఎక్కువగా కిడ్నీల్లో రాళ్లు తొలగి పోతాయి. బొప్పాయిని తినడం వల్ల కిడ్నీల్లో రాళ్లు కరిగి పోవడం లేదా యూరిన్ ద్వారా బయటకు వెళ్లి పోవడం జరుగుతుందట. లివర్ సమస్యలు ఉన్నవారితో ఆటు కిడ్నీల్లో సమస్యలు ఉన్నవారు ప్రతి రోజు క్రమం తప్పకుండా కప్పు బొప్పాయి పండ్లు తినాల్సిందిగా వైధ్యులు కూడా సూచిస్తున్నారు.
కేవలం ఈ రెండు ప్రయోజనాలు మాత్రమే కాకుండా బొప్పాయిలో ఉండే ఏ, బీ, సీ, ఇ విటమిన్లు మానవ శరీరంకు అత్యంత అవసరం. అందుబాటు రేటు లో ఉండే అత్యంత ప్రభావితమైన ఫలం అంటే ఇదే. కనుక ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమయంలో ఈ బొప్పాయి తినడం మంచిది. బొప్పాయిలో ఔషధ గుణాలు మరియు విటమిన్లు చాలానే ఉన్నాయి. బొప్పాయి ని ఎక్కువగా రక్త కణాలు పడిపోయిన వారికి తినిపించేందుకు ప్రయత్నిస్తారు. ఆ సమయంలో బొప్పాయి చెట్టు ఆక్కులను కూడా రసంగా మార్చి తాగించాలని స్వయంగా వైధ్యులు అంటూ ఉంటారు. డెంగ్యూ ఫీర్ మరియు రక్త కణాలు పడిపోవడం వంటి సమస్యలు ఎదుర్కొనే వారు కూడా బొప్పాయిని ఔషదంగా వాడవచ్చు.
0 Comments:
Post a Comment