Bomb cyclone: అమెరికాలో మంచు తుపాను(Bomb cyclone) బీభత్సం కొనసాగుతూనే ఉంది. ఈ శతాబ్దంలోనే ఎన్నడూ లేనంతగా కురుస్తున్న మంచుకు దేశమంతా అతలాకుతలం అవుతోంది.
ఇప్పటికే మంచుగాలుల దాటికి నాలుగు వేలకు పైగా దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దయ్యాయి. అత్యంత ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 60 మందికిపైగా మరణించినట్లు తెలుస్తోంది.
చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ప్రజలంతా నానావస్థలు పడుతున్నారు. న్యూయార్క్, బఫెలో కౌంటీలో నెలకొన్న దుర్భర పరిస్థితులు ప్రస్తుతం సోషల్ మీడిలో చక్కర్లు కొడుతున్నాయి.
అమెరికాలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మైనస్‌లో నమోదవుతున్నాయి. వీటి కారణంగా ప్రపంచంలోనే అతిపెద్దదైన నాయాగారా జలపాతం గడ్డకట్టుకుపోయింది. ఎన్నడూ జరుగని వింతను చూసేందుకు పర్యాటకులు తండోపతండాలుగా విచ్చేస్తున్నారు.
ఈ అద్భుత దృశ్యాన్ని చూసి ముగ్ధులైపోతున్నారు. నయాగరాకు 25 మైళ్ల దూరంలో బఫెలో ఉంటుంది. అయితే, నయాగరాలో కొన్ని ప్రదేశాల్లో నీరు గడ్డకట్టినా.. ప్రవాహం కారణంగా కొన్ని చోట్ల మాత్రం జలపాతం పరవళ్లు తొక్కుతోంది.
గట్టకట్టుకుపోయిన నయాగరా జలపాతం ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
0 Comments:
Post a Comment