ఉత్తర అమెరికాలో బాంబ్ సైక్లోన్ బెంబేలెత్తిస్తోంది. గత చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో న్యూయార్క్ నగరాన్ని మంచు ముంచెత్తుతోంది.
గత కొద్దిరోజులుగా మంచుతుఫాను భీభత్సం సృష్టిస్తోంది. మంచుతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్థంభించిపోయింది. దాదాపు 1346 ఫ్లైట్స్‌ని రద్దుచేశారు. తుఫాను దాటికి మరణించినవారి సంఖ్య 34కి చేరింది. అధికారిక లెక్కల ప్రకారం ఈ సంఖ్య 40 దాటుతుందని అంచనా వేస్తున్నారు.
అనేక ప్రాంతాల్లో విద్యుత్ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిపోయింది. ఇప్పటికింకా అమెరికాలోని అనేక ప్రాంతాలు అంధకారంలో బిక్కు బిక్కుమంటున్నాయి. మొత్తం అమెరికాలోని 5.5 కోట్ల మందిపై ఈ మంచుతుఫాను ప్రభావం పడింది.
న్యూయార్క్, బఫెలో నగరంలో హరికేన్‌ని తలపించే చలిగాలులు వీస్తున్నాయి. ఎటు చూస్తే అటు మంచు…అడుగు బయటపెట్టే పరిస్థితి లేదు. వాహనాలు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి.
విద్యుత్ కోతలు పెరిగాయి. నిర్ణీత సమయంలో విద్యుత్ కోతలు మరికొంత కాలం తప్పదని ప్రభుత్వం వెల్లడించింది. విద్యుత్ సరఫరా దెబ్బతిన్న చోట్ల మరమ్మత్తులు చేసి, విద్యుత్ పునరుద్ధరిస్తున్నారు. బఫెలో లోని ఇంర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ని మూసివేశారు. బఫెలో నగరంలో దాదాపు ముగ్గురు మృత్యువాత పడ్డారు.
ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి, ప్రజలకు చలినుంచి రక్షణ కల్పిస్తున్నారు.
మంచు తుఫానుతో వాతావరణ పీడనం కనిష్టస్థాయికి పడిపోతే దాన్ని 'బాంబ్ సైక్లోన్' అంటారు. ఇప్పుడు ఇదే బాంబ్ సైక్లోన్ అమెరికాని గజగజ వణికిస్తోంది.
ఆర్కిటిక్ నుంచి వచ్చే అతిశీతల గాలుల వల్ల అమెరికా, కెనడా గడ్డకట్టిపోతోంది. ప్రధానంగా ఉత్తర అమరికాలో సాధారణంగా సూర్యకిరణాలు ఏటవాలుగా పడతాయి. అందువల్ల వేడికంటే, చలి ఎక్కువగా ఉంటుంది.
దీనికి తోడు తాజా చలిగాలులు వణికిస్తున్నాయి. వెర్మోంట్, ఒహియో, మిస్సోరీ, విస్కాన్సిన్, కన్సాస్, కొలరాడోల్లో ఎక్కువ మరణాలు నమోదవుతున్నాయి.
0 Comments:
Post a Comment