Bluetooth Bluebugging : మీ ఫోన్లో బ్లూటూత్ ఆన్ చేస్తున్నారా? హ్యాకింగ్ అయిపోతుంది జర జాగ్రత్త!
స్మార్ట్ ఫోన్ లేని మనిషి ఇక్కడ ఉండనే వుండడు. ఎందుకంటే కమ్యూనికేషన్ కి ఇది తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదు మరి. ఈ క్రమంలో సైబర్ కేటుగాళ్ల బెడద కూడా ఎక్కువయ్యింది.
ఎన్ని రకాలుగా వారిని నివారించాలని ప్రయత్నించినప్పటికీ మోసం చేస్తున్నవారు కొత్త పద్ధతులను కనిపెడుతూనే ఉన్నారు. ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చిన హ్యాకింగ్ పద్ధతి ‘బ్లూ బగ్గింగ్’ గురించి మీరు విన్నారా? అంటే బ్లూటూత్ ద్వారా ఫోన్ హ్యాక్ చేయడం అన్నమాట.
అవును, మీ స్మార్ ఫోన్ ఒక్కసారి బ్లూ బగ్ అయిందంటే ఇక అంతే, మీ ఫోన్లోని విలువైన సమాచారం అంటే... ఫోటోలు, మెసేజెస్, కాంటాక్ట్స్ దొంగిలిస్తారు. ఇక వాటిని అడ్డం పెట్టుకొని దొంచిలించడం చేస్తుంటారు. అదే మహిళలు ఈ మోసానికి గురైతే ఇక వారికి నరకం చూపిస్తారు. అందుకే నేడు బ్లూటూత్ కనెక్టివిటీ ఉన్న ల్యాప్‌టాప్‌లు లేదా కంప్యూటర్లకు ఈ బగ్ ప్రమాదకరంగా మారింది. హ్యాకర్లు మొబైల్ ఫోన్లు, ఇతర గాడ్జెట్లపై దాడి చేయడానికి ఈ పద్ధతిని ఇటీవల ఎక్కువగా ఉపయోగిస్తున్నట్టు భోగట్టా.
హ్యాక్ చేసిన తర్వాత దాడి చేసే వ్యక్తి మీ వ్యక్తిగత పరిచయాలకు యాక్సెస్‌ను కలిగి ఉంటారు. అచ్చం మీలాగే మాట్లాడి, మీ నెంబర్ తోనే వారిని బురిడీ కొట్టిస్తారు. 'బ్లూబగ్గింగ్' అని పిలువబడే ఈ దాడులు బ్లూటూత్ హార్డ్‌వేర్‌ను ఎక్కువగా వినియోగించుకున్నట్టు ఓ సర్వేలో తేలింది. అందుకే సైబర్ పోలీసులు మొబైల్ యూజర్లను అలెర్ట్ చేస్తున్నారు. హ్యాకర్ బ్లూటూత్ ద్వారా డివైస్‌తో పెయిర్ చేయడానికి ప్రయత్నిస్తాడు. కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత, ఆథెంటికేషన్‌ను క్రాస్ చేయడానికి హ్యాకర్లు బ్రూట్ ఫోర్స్ దాడులను ఉపయోగించవచ్చు. అందుకే అత్యవసరం అయితే తప్ప బ్లూటూత్‌ని వాడకపోవడమే ఉత్తమం.
0 Comments:
Post a Comment