Blood thinner medicine రక్తాన్ని పలుచగా చేసే ఔషధంతో ప్రాణాపాయం ఎక్కువే..రీసెర్చ్ లో వెల్లడి..
"కొండనాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడింది." అనే సామెత కొన్ని సందర్భాల్లో నిజమవుతుంది. ముఖ్యంగా కొన్నిరకాల అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు వాడే మందుల వల్ల అలా జరుగుతుంది. అదే విషయాన్ని పలు రకాల పరిశోధనలు ఎన్నో సార్లు నిరూపించాయి కూడా. కరోనా వచ్చిన సమయంలో వాడిన అపిక్సాబాన్ టాబ్లెట్ అత్యంత ప్రమాదకరమని తాజా రీసెర్చ్ లో వెల్లడైంది.
అపిక్సాబాన్ అనేది ఓరల్ టాబ్లెట్ రూపంలో ఇచ్చే ఔషధం. గుండె కవాట వ్యాధి(హార్ట్ వాల్వ్ డిసీజ్) వల్ల శరీరంలో రక్తం గడ్డకడుతుంది. తద్వారా హార్ట్ స్ట్రోక్‌లకు కారణమవుతుంది. ఈ సమస్య ఉన్న వ్యక్తులలో స్ట్రోక్‌లు లేదా రక్తం గడ్డకట్టడాన్ని నిరోధించడంలో అపిక్సాబాన్ (Apixaban) ఉపయోగిస్తారు.
అంతేకాదు కాలేయ సంబంధిత సమస్యలకు ఈ టాబ్లెట్ ను వాడతారు.
Apixaban ప్రతిస్కందకాలు కారకం Xa బ్లాకర్స్ అని పిలిచే ఔషధాల తరగతికి చెందినది. ఔషధం రక్తాన్ని పలుచగా చేస్తుంది. శరీరంలో రక్తం గడ్డకట్టకుండా నిరోధించడంలో సహాయపడుతుంది. ఇది Xa అనే పదార్థ కారకాన్ని నిరోధించడం ద్వారా పనిచేస్తుంది, ఇది రక్తంలో ఎంజైమ్ థ్రాంబిన్ మొత్తాన్ని తగ్గిస్తుంది.
" కోవిడ్ తర్వాత రోగులకు స్పష్టమైన ప్రయోజనం లేకుండా అపిక్సాబాన్ టాబ్లెట్ వాడారు. ఇది ప్రమాదంఉందనడానికి మొదటి బలమైన సాక్ష్యం" అని అధ్యయనంలో పాల్గొన్న కో-చీఫ్ ఇన్వెస్టిగేటర్ డాక్టర్ మార్క్ టోష్నర్ అన్నారు."ఈ ఫలితాలు ఇకనైనా ఈ అపిక్సాబాన్ కోవిడ్-19 రోగులకు అనవసరంగా సూచించడాన్ని ఆపివేస్తాయని, మేము వైద్య విధానాన్ని మార్చగలమని మా ఆశ" అని ఆయన చెప్పారు.
"ఈ అన్వేషణ ముఖ్యమైనది ఎందుకంటే ఇది ఎటువంటి ప్రయోజనం లేకుండా ప్రజలకు అనవసరమైన హానికలిగిస్తుంది" అని వైద్య నిపుణులు అంటున్నారు. కేంబ్రిడ్జ్ యూనివర్శిటీలోని నిపుణుల నేతృత్వంలో "అపిక్సాబాన్" వినియోగంపై రీసెర్చ్ జరిగింది. ఇందులో 402 మంది వాలంటీర్లకు అపిక్సాబాన్ ఇచ్చారు. వారిలో చాలా మందిలో తీవ్ర రక్తస్రావం జరిగింది.
అపిక్సాబాన్ను అందించడం వల్ల కరోనా నుంచి కోలుకున్న రోగులు కూడా మరోమారు ఆసుపత్రిలో చేరుతున్నారట. ఎందుకంటే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన కోవిడ్ రోగులకు విస్తృతంగా రక్తాన్ని పలుచన చేసే ఔషధం పని చేయడం లేదని,తీవ్రమైన దుష్ప్రభావాలు కలిగి ఉన్నట్లు ఓ అధ్యయనం ద్వారా కనుగొన్నారు.
అపిక్సాబాన్ అనే ఔషధం తీవ్రమైన రక్తస్రావం కలిగిస్తుందని పరిశోధనలో తేలింది. ఈ టాబ్లెట్ తరచుగా ఉపయోగించడం వల్ల 'రోగులకు ప్రాణాపాయం' ఉందని పరిశోధకులు వెల్లడిస్తున్నారు.
0 Comments:
Post a Comment