జికా వైరస్ తొలికేసు నమోదు.. ఆందోళన చెందుతున్న కర్ణాటక ప్రజలు...
జికా వైరస్ అంటే ప్రపంచాన్ని వణికించే ఓ మహమ్మారి అయితే ఈ వైరస్ పై భారత దేశ కేంద్రప్రభుత్వ ఆరోగ్యశాఖ అప్రమత్తం అయింది. ఎందుకంటే ఈ వైరస్ కొన్ని లక్షల మందికి సోకే అవకాశం ఉంది.
ముఖ్యంగా గర్భిణీలు మరియు చిన్నారులు తేలిగ్గా ఈ వైరస్ బారిన పడే ప్రమాదం ఉందని అంతేకాకుండా ఈ వైరస్ ధోమల కారణంగా ఈ వైరస్ వ్యాప్తి అవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తుంది. అయితే మన దేశంలో మొదటి కేసు కేరళలో వచ్చిందని మరియు ఇప్పుడు కర్ణాటక రాష్ట్రం రాయచూర్ ప్రాంతానికి చెందిన ఐదేళ్ల బాలిక ఆరోగ్య పరీక్షల్లో జికా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు గుర్తించారు. కాగా ప్రభుత్వం అన్ని ముందస్తు నివారణ చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర వైద్య మంత్రి కే.సుధాకర్ హామీ ఇచ్చారు. అయితే పూణె ల్యాబ్ కు ఐదేళ్ల చిన్నారి రక్త నమూనాలను పంపించగా, వైరస్ ఉన్నట్టు తేలింది.
రాష్ట్రంలో ఇది తొలి కేసు అని, పరిస్థితిని ప్రభుత్వం చాలా జాగ్రత్తగా పర్యవేక్షిస్తోందని మంత్రి చెప్పారు. పూణె ల్యాబ్ కు నమూనాలను ఈ నెల 5న పంపించగా, జికా వైరస్ ఉన్నట్టు 8న రిపోర్ట్ వచ్చింది. మంత్రి సుధాకర్ మాట్లాడుతూ.. కొన్ని నెలల క్రితం జికా వైరస్ కేరళ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ లో బయటపడినట్టు చెప్పారు.
''కర్ణాటకలో ఇదే తొలి కేసు. ముందుగా మేము డెంగ్యు, చికున్ గున్యా అనుకున్నాం. సాధారణంగా ఇలాంటి 10 శాతం నమూనాలను పూణె ల్యాబ్ కు పంపిస్తుంటాం'' అని వివరించారు. కావున ఈ చిన్నారి ఇటీవలి కాలంలో ఏ ప్రాంతాలకి వెళ్లలేదని దోమ ద్వారా ఆమెకు వైరస్ సోకి ఉంటుందని సమాచారం.
జికా వైరస్ ఏడిస్ అనే దోమ నుంచి వ్యాపిస్తుంది. డెంగ్యూ, చికున్ గున్యా వైరస్ లను కూడా ఈ దోమే వ్యాప్తి చేస్తుంటుంది. 1947లో ఉగాండాలో తొలిసారి దీన్ని గుర్తించారు. ఇదేమంత ప్రాణాంతక వ్యాధి కాదని ఇది చికిత్సతో తగ్గిపోతుందని వెల్లడించారు.
0 Comments:
Post a Comment