Best Mileage Bike: ఒక్కసారి ట్యాంక్ ఫుల్ చేస్తే 700 కిలోమీటర్లు వెళ్లొచ్చు.. బెస్ట్ మైలేజ్ బైక్ ఇదే!
Bajaj CT 110 Mileage | కొత్త బైక్ కొనాలనే ఆలోచనలో ఉన్నారా? బడ్జెట్ ధరలో మంచి బైక్ కోసం చూస్తున్నారా? చాలా మంది అధిక మైలేజ్ ఇచ్చే బైక్స్ (Bikes) కోసం చూస్తూ ఉంటారు.
మార్కెట్‌లో మైలేజ్ బైక్స్ అంటేనే బజాజ్, టీవీఎస్ (TVS), హీరో మోటొకార్ప్ (Hero) వంటి పేర్లు గుర్తుకు వస్తాయి. చాలా మంది ఈ కంపెనీలకు చెందిన బైక్స్‌నే కొంటూ ఉంటారు. గ్రామీణ ప్రాంతాల్లో వీటికి ఉన్న డిమాండ్ వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. అధిక మైలేజ్ ఇచ్చే బైక్స్‌లో బజాజ్ సీటీ 110 కూడా ఒకటి.
బజాజ్ సీటీ 110 బైక్ లీటరుకు 90 కిలోమీటర్ల మేర మైలేజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంటోంది. ప్రత్యేక పరిస్థితుల్లోనే ఈ మైలేజ్ సాధ్యం. అందుకే కంపెనీ చెప్పే మైలేజ్‌కు మనం రోడ్డు మీద నడిపే వచ్చే మైలేజ్‌కు కొంత మేర వ్యత్యాసం ఉండొచ్చు. లీటరుకు ఈ బైక్ 70 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుందని వాహనదారులు పేర్కొంటూ ఉంటారు. ఇదైనా ఎక్కువ మైలేజ్ అనే చెప్పుకోవాలి. ఈ బైక్‌లో 115 సీసీ ఇంజిన్ ఉంటుంది. దీని రేటు రూ. 61 వేలుగా ఉంది. హైదరాబాద్‌లో ఈ రేటు వర్తిస్తుంది.
ఈ బైక్ టాప్ స్పీడ్ గంటకు 90 కిలోమీటర్లు. రూ. 2090 నెలవారీ ఈఎంఐతో ఈ బైక్ కొనుగోలు చేయొచ్చు. ఈ బైక్ ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 10.5 లీటర్లు. అంటే మీరు ఒక్కసారి ఈ బైక్‌కు ఫుల్ ట్యాంక్ కొట్టిస్తే.. ఏకంగా 700 కిలోమీటర్లకు పైగా వెళ్తుందని చెప్పుకోవచ్చు. అంటే హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లిపోవచ్చు. అయితే ఇలాంటి కమ్యూటర్ బైక్స్‌పై ఎక్కువ దూరం ప్రయాణం చేయడం కష్టమనే చెప్పుకోవాలి.
అధిక మైలేజ్ కోరుకునే వారికి ఇలాంటి బైక్స్ అనువుగా ఉంటాయి. బజాజ్ ఆటో గతంలో సీటీ 100 బైక్‌ను విక్రయించేది. అయితే ఈ బైక్ తయారీని ఆపేసింది. బీఎస్ 6 ఇంజిన్‌తో దీని స్థానంలో సీటీ 110 ఎక్స్ బైక్‌ను తీసుకువచ్చింది. అలాగే ఇందులో మరో వేరియంట్ కూడా ఉంది. బజాజ్ సీటీ 125 ఎక్స్ మోడల్ కూడా ఉంది. రెండింటి ధరలో వ్యత్యాసం ఉంటుంది. ఈ మోడల్‌లో ఇంజిన్ పవర్ కాస్త ఎక్కువగా ఉంటుంది. దీని రేటు కూడా ఎక్కువే. రూ. 75 వేలుగా ఉంది. ఇకపోతే ఈ రెండు బైక్స్ చూడటానికి ఒకేలా ఉంటాయి. యూఎస్‌బీ పోర్ట్ చార్జింగ్, డీఎల్ఆర్ లైట్స్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
0 Comments:
Post a Comment