Belly Fat Home Remedies In telugu : ఈ మధ్య కాలంలో మారిన జీవనశైలి పరిస్థితులు, ఎక్కువగా జంక్ ఫుడ్స్ తీసుకోవడం, గంటల తరబడి ఒకే చోట ఎక్కువసేపు కూర్చొని ఉండటం, శారీరక శ్రమ లేకపోవడం, వ్యాయామం చెయ్యకపోవటం వంటి అనేక రకాల కారణాలతో పొట్ట వద్ద కొవ్వు ఎక్కువగా పేరుకుపోతూ ఉంటుంది.
ఇలా పెరిగిపోయిన పొట్టను తగ్గించుకోవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అవి పెద్దగా ఫలితాన్ని ఇవ్వక చాలా నిరాశపడుతూ ఉంటారు. ఇప్పుడు చెప్పే డ్రింక్ ప్రతి. రోజు తీసుకుంటే పొట్ట వద్ద ఉన్న కొవ్వు క్రమంగా కరిగిపోయి బాన పొట్ట కాస్త ఫ్లాట్ గా మారుతుంది. ఈ రెమెడీ చేయటం చాలా సులువు.
ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో పావు స్పూన్ దాల్చిన చెక్క పొడి, పావుస్పూన్ నల్ల మిరియాల పొడి వేసి బాగా కలిపి మూత పెట్టి అరగంట అలా వదిలేయాలి. ఆ తర్వాత ఆ నీటిని వడగట్టి ఒక స్పూన్ నిమ్మరసం., అర స్పూన్ తేనె వేసి బాగా కలిపి ప్రతి రోజు ఉదయం పరగడుపున తాగాలి. ఈ విధంగా ప్రతి. రోజు తాగుతూ ఉంటే బానపట్ట నెల రోజుల్లోనే ప్లాట్ గా మారుతుంది.
శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు కరిగి బరువు తగ్గుతారు. అంతే. కాకుండా ఈ నీటిని ప్రతిరోజు తీసుకోవడం వలన శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది. మానసిక సమస్యలు తొలగి మానసిక ప్రశాంతత కలుగుతుంది. శరీరంలో పేరుకుపోయిన మలినాలు., వ్యర్ధాలు అన్ని తొలగిపోతాయి.
కాబట్టి ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఈ నీటిని తాగి ఇప్పుడు చెప్పిన ప్రయోజనాలు పొందండి. డయాబెటిస్ ఉన్నవారు ఈ నీటిని తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. అయితే డయాబెటిస్ ఉన్నవారు ఈ నీటిని తేనె లేకుండా తీసుకోవాలి. చెడు కొలెస్ట్రాల్ తొలగించటంలో సహాయపడుతుంది.
0 Comments:
Post a Comment