Beef Chocolate: పిల్లలు తినే చాక్లెట్లలో గొడ్డు మాంసం.. తినేముందు ఒకసారి చెక్ చేయండి..
సాధారణంగా ప్యాకేజ్డ్ ఫుడ్ కొనుగోలు చేసేటప్పుడు... అందులో ఎలాంటి పదార్థముందో మనకు బయటకు కనిపించదు. కానీ కొన్ని గుర్తుల ద్వారా ఆ వివరాలను తెలుసుకోవచ్చు.
ఫుడ్ ఐటమ్స్‌పై అది శాకాహారమా (Veg)? మాంసాహారమా (Non Veg)? చెప్పేలా.. గ్రీన్, రెడ్ కలర్ గుర్తులు ఉంటాయి. గ్రీన్ కలర్ ఉంటే.. శాఖాహారం అని, రెడ్ కలర్ ఉంటే..మాంసాహారమని అర్థం. పిజ్జాలు, బర్గర్లు, చికెన్ బిర్యానీ వంటి తినేటప్పుడు ప్యాకెట్లపై ఇలాంటివి చూస్తుంటాం. కానీ చాక్లెట్స్ విషయంలో మాత్రం పెద్దగా పట్టించుకోం. ఐతే ఇకపై చాక్లెట్స్ తినేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మార్కెట్‌లోకి నాన్ వెజ్ చాక్లెట్లు కూడా వచ్చేశాయి. అందుకే చాక్లెట్ కవర్‌పై అది శాఖాహారమా? మాంసాహారమా? చెక్ చేసి.. ఆ తర్వాతే తినాలి.
గొడ్డు మాంసం (బీఫ్)తో తయారుచేసిన చాక్లెట్లు (Beef Chocolate) రాజస్థాన్‌లో తీవ్ర కలకలం రేపాయి. ఉదయ్‌పూర్‌లోని ఢిల్లీ గేట్ క్రాస్ రోడ్స్‌లో బీఫ్ చాక్లెట్లను అధికారులు గుర్తించారు. ఇక్కడి నుంచి నగరంలోని ఇతర దుకాణలను బీఫ్ చాక్లెట్లు సరఫరా అవుతున్నట్లు వెల్లడించారు. చిల్లీ మిల్లీ పేరుతో ఈ చాక్లెట్లను బీఫ్ ప్రొటీన్‌తో తయారు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. మూడు సంచుల చాక్లెట్లను స్వాధీనం చేసుకున్న అధికారులు.. వాటిని పరీక్షించేందుకు ల్యాబ్‌కు పంపించారు.
ఉదయ్‌పూర్‌లోని పోలీస్ కంట్రోల్ రూంకు కేవలం కొన్ని అడుగుల దూరంలో ఈ చాక్లెట్ల విక్రయాలు జరుగుతున్నాయి. చిల్లీ మిల్లీ చాక్లెట్ ప్యాకెట్‌పై మేడిన్ పాకిస్తాన్ అని రాసి ఉంది. ఇవి పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌లో తయారవుతున్నాయి. వాటిపై నాన్ వెజ్ చాక్లెట్ అని కూడా రాసిఉంది. సీజ్ చేసిన పార్సిల్‌పై బలూచిస్తాన్ చిరునామా కనిపించింది. మార్కెట్‌లో ఒక్క చాక్లెట్ రూ.20కి అందుబాటులో ఉంది. చిన్నపిల్లల లక్ష్యంగా చిల్లీ-మిల్లీ చాక్లెట్లను విక్రయిస్తున్నట్లు తెలిసింది. షాప్ నుంచి స్వాధీనం చేసుకున్న చాక్లెట్లకు దుకాణాదారుడి వద్ద బిల్లులు లేవు. తాము ముంబై నుంచి ఈ చాక్లెట్లను కొనుగోలు చేశామని.. అంతకు మంచి తమకేమీ తెలియని వెల్లడించారు. చాక్లెట్‌లో గొడ్డు మాంసం ఉన్నట్లు తేలితే.. దుకాణాదారుడిపై చర్యలు తీసుకుంటామని స్పష్ట చేశారు.
మార్కెట్‌లోని ఇతర షాపుల్లో కూడా ఇలాంటి చాక్లెట్లు చాలానే అమ్ముడవుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. దీనిపై రాజకీయ దుమారం కూడా రేగుతోంది. రాజస్థాన్ ప్రభుత్వంపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. భారత పౌరులకు చాక్లెట్ల ద్వారా పాక్ నుంచి భారత్‌కు గొడ్డు మాంసం పంపేందుకు పెద్ద కుట్ర జరుగుతోంది
0 Comments:
Post a Comment