Search This Blog

Friday, 30 December 2022

Bank Locker: బ్యాంకు లాకర్ ఒప్పందాన్ని పునరుద్ధరించండి.. ఎందుకంటే?

 Bank Locker: బ్యాంకు లాకర్ ఒప్పందాన్ని పునరుద్ధరించండి.. ఎందుకంటే?

కొత్త సంవత్సరం సమీపించడంతో బ్యాంకులు తమ లాకర్‌ (Bank Locker) కస్టమర్లకు సందేశాలు పంపుతున్నాయి. వెంటనే తమ లాకర్‌ (Bank Locker) ఒప్పందాన్ని పునరుద్ధరించుకోవాలన్నది ఆ సందేశాల సారాంశం.
2022 డిసెంబరు 31 నాటికే ఈ ప్రక్రియ పూర్తి చేయాలని సూచిస్తున్నాయి. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారమే ఈ సందేశాలు పంపుతున్నట్లు పేర్కొన్నాయి.

ఆర్‌బీఐ ఇటీవల బ్యాంకులకు లాకర్‌ నిబంధనలకు సంబంధించి కొన్ని మార్గదర్శకాలను జారీ చేసినట్లు సమాచారం. వాస్తవానికి 2022 ఆరంభంలోనే ఆర్‌బీఐ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. వాటిని ఆగస్టు నెలలో సమీక్షించి కొన్ని మార్పులు చేసింది. అవే కొత్త సంవత్సరం నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే లాకర్‌ సదుపాయం తీసుకున్న కస్టమర్లంతా తమ ఒప్పందాన్ని పునరుద్ధరించుకోవాలని బ్యాంకులు సూచిస్తున్నాయి.

కొత్త మార్గదర్శకాల తర్వాత లాకర్‌ నిబంధనలిలా....
☆ బ్యాంకులు లాకర్‌ ఒప్పందంలో ఎలాంటి అనైతిక షరతులను చేర్చడానికి వీల్లేదు. అలాగని బ్యాంకు ప్రయోజనాలను దెబ్బతీసేంత ఉదారంగా కూడా నిబంధనలు ఉండొద్దు.

☆ లాకర్‌ కేటాయించడానికి ముందు కస్టమర్‌, బ్యాంకు మధ్య కచ్చితంగా ఒప్పంద పత్రం ఉండాలి. స్టాంప్‌ పేపర్‌పై నియమ నిబంధనలతో ఈ ఒప్పందాన్ని కుదుర్చుకోవాలి. దీనికి సంబంధించిన ఓ నకలు పత్రాన్ని కస్టమర్‌కు ఇవ్వాలి. తద్వారా లాకర్‌ తీసుకున్నవారికి వారి హక్కులు, బాధ్యతలు తెలుస్తాయి.

☆ 'ఇండియన్‌ బ్యాంక్‌ అసోసియేషన్‌ (IBA)' రూపొందించిన ప్రామాణిక ముసాయిదా ప్రకారం ఒప్పందం ఉండేలా బ్యాంకులు చూసుకోవాలి. కొత్త నిబంధనలతో పాటు, సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారమే ఒప్పంద పత్రం ఉండాలి.
☆ ఒకవేళ బ్యాంకుల నిర్లక్ష్యం వల్ల దొంగతనం, అగ్ని ప్రమాదం, భవనం కూలిపోవడం.. వంటి ప్రమాదం సంభవించి లాకర్‌లోని వస్తువులు లేదా నగదు పోతే.. వినియోగదారుడు చెల్లించిన లాకర్‌ రుసుముకు 100 రెట్ల మొత్తాన్ని నష్టపరిహారంగా ఇవ్వాల్సి ఉంటుంది.

☆ బ్యాంకులు లాకర్‌ గదుల్లో కచ్చితంగా సీసీటీవీలను ఏర్పాటు చేయాలి. అలాగే సీసీటీవీ డేటాను 180 రోజుల వరకు నిక్షిప్తం చేసి ఉంచాలి. ఒకవేళ ఏదైనా ప్రమాదం సంభవిస్తే ఇది ఉపయోగకరంగా ఉంటుంది.

☆ కస్టమర్లు తమ లాకర్‌ని తెరిచినప్పుడల్లా బ్యాంకులు వారికి ఎసెమ్మెస్‌, ఇ-మెయిల్‌ రూపంలో సందేశం పంపాలి. తద్వారా ఎలాంటి మోసాలకు తావుండదు.

☆ కొత్తగా లాకర్‌ తీసుకునేవారి నుంచి మూడేళ్ల అద్దెతో పాటు ఇతర ఛార్జీలకు సమానమైన మొత్తాన్ని ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయమని బ్యాంకులు కోరవచ్చు. అయితే, ఇది తప్పనిసరి కాదు. ఇప్పటికే లాకర్‌ ఉన్నవాళ్లు, ఖాతాల నిర్వహణలో క్రమశిక్షణతో ఉన్న కస్టమర్ల నుంచి ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ తీసుకోవాల్సిన అవసరం లేదు.

☆ ఒకవేళ లాకర్‌ తీసుకున్న కస్టమర్‌ మరణిస్తే.. నామినీకి లాకర్‌లోని వస్తువులను తీసుకునేందుకు అనుమతి ఇవ్వొచ్చు. అయితే, కచ్చితంగా మరణ ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది.


0 Comments:

Post a Comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Technology

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top