Bank Account | ప్రైవేట్ రంగానికి చెందిన ప్రముఖ బ్యాంకుల్లో ఒకటైన ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ సంచలన నిర్ణయం తీసుకుంది.
డిసెంబర్ 17న కీలక ప్రకటన చేసింది. సేవింగ్స్ ఖాతాలపై చార్జీలను తొలగిస్తున్నట్లు వెల్లడించింది.
జీరో ఫీజు బ్యాంకింగ్ సేవలను ఆవిష్కరించింది. బ్యాంక్ సర్వీసులపై సర్వసాధారణంగా ఉండే దాదాపు 25 రకాల చార్జీలను ఈ బ్యాంక్ మాఫీ చేసింది.
దీని వల్ల బ్యాంక్ కస్టమర్లకు చాలా ఊరట కలుగుతుందని చెప్పుకోవచ్చు. ఇలాంటి నిర్ణయం తీసుకున్న తొలి బ్యాంక్ కూడా ఇదే కావడ గమనార్హం.
బ్యాంక్ బ్రాంచుల్లో క్యాష్ డిపాజిట్, క్యాష్ విత్‌డ్రాయెల్, థర్డ్ పార్టీ క్యాష్ ట్రాన్సాక్షన్లు, డిమాండ్ డ్రాఫ్ట్స్, ఐఎంపీఎస్, నెఫ్ట్, ఆర్‌టీజీఎస్, చెక్ బుక్, ఎస్ఎంఎస్ అలర్ట్స్, ఇంట్రెస్ట్ సర్టిఫికెట్, ఇన్‌సఫిషియెంట్ బ్యాలెన్స్ ఫర్ ఏటీఎం ట్రాన్సాక్షన్స్, ఇంటర్నేషనల్ ఏటీఎం వినియోగం వంటి చార్జీలు ఏవీ ఉండవు.
బ్యాంక్ ఫౌండేషన్ డే సందర్బంగా ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ ఈ ప్రకటన చేసింది. డిసెంబర్ 18న బ్యాంక్ ఫౌండేషన్ డే. అయితే ఇక్కడ బ్యాంక్ ఒక మెలిక పెట్టింది. మినిమమ్ బ్యాలెన్స్ కలిగి ఉండాలని సూచించింది. ఇలాంటి వారికే ఈ బెనిఫిట్స్ ఉంటాయని తెలిపింది.
కస్టమర్లు వారి బ్యాంక్ అకౌంట్‌లో నెలవారీ యావరేజ్ బ్యాలెన్స్‌ను రూ. 10,000గా కలిగి ఉండాలని బ్యాంక్ తెలిపింది. అలాగే రూ. 25 వేల మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్లకు ఈ బెనిఫిట్స్ వర్తిస్తాయని తెలిపింది.
కస్టమర్లకు ఎంతో ఊరట కలిగించే నిర్ణయం ఇదని ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ పేర్కొంది. బ్యాంక్ ప్రారంభం దగ్గరి నుంచి బ్యాంక్ అందిస్తున్న అన్ని ప్రొడక్టులకు సంబంధించి నిబంధలను సరళతరం చేస్తూ వస్తోందని వివరించింది.
కస్టమర్లు ఫీజులు, చార్జీలు వంటి అంశంపై పెద్దగా అవగాహణ కలిగి ఉండకపోవచ్చని ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ ఎండీ వైద్యనాథన్ తెలిపారు. తక్కువ ఆర్థిక అక్షరాస్యత కలిగిన వారికి కూడా ఈ నిర్ణయం వల్ల ఊరట కలుగుతుందని తెలిపారు. 25 రకాల చార్జీలు తొలగించామని, దీంతో కస్టమర్లు ప్రశాంతంగా బ్యాంకింగ్ సేవలు పొందొచ్చని పేర్కొన్నారు.
బ్యాంక్ బ్రాంచ్‌లో క్యాష్ ట్రాన్సాక్షన్ల సంఖ్య, బ్యాంక్ బ్రాంచ్‌లో క్యాష్ ట్రాన్సాక్షన్ల విలువ, థర్డ్ పార్టీ క్యాష్ ట్రాన్సాక్షన్లు, డిమాండ్ డ్రాఫ్ట్, ఐఎంపీఎస్, నెఫ్ట్, ఆర్‌టీజీఎస్, చెక్ బుక్, ఎస్ఎంఎస్ అలర్ట్, డూప్లికేట్ స్టేట్‌మెంట్, పాస్‌బుక్, బ్యాలెన్స్ సర్టిఫికెట్, ఇంట్రెస్ట్ సర్టిఫికెట్ చార్జీలు తొలగించింది.
అలాగే అకౌంట్ క్లోజర్, ఈసీఎస్ రిటర్న్, స్టాప్ పేమెంట్, ఇంటర్నేషనల్ ఏటీఎం, చార్జ్ ఫర్ ఇన్‌సఫిషియెంట్ ఏటీఎం బ్యాలెన్స్, స్టాండింగ్ ఇన్‌స్ట్రక్షన్స్, మేనేజర్స్ చెక్, ఫోటో అటెస్టేషన్, సిగ్నేచర్ అటెస్టేషన్, కాపీ ఆఫ్ పెయిడ్ చెక్, అడ్రస్ కన్ఫర్మేషన్, కొరియర్ డెలివరబుల్ రిటర్న్ వంటి చార్జీలు అన్నింటినీ బ్యాంక్ మాఫీ చేసింది.
0 Comments:
Post a Comment