అరటిపండు Vs ఆపిల్. ఏది ఆరోగ్యానికి మంచిది. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారికి...
Banana and apple benefits In Telugu : అరటిపండు, ఆపిల్ లలో ఎన్నో పోషకాలు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ప్రతి రోజు ఒక ఆపిల్ తింటే డాక్టర్ అవసరం ఉండదని పోషకాహార నిపుణులు చెప్పుతున్నారు.
అరటిపండు కూడా మనలో ఎక్కువ మంది తినే పండు. అలాగే సంవత్సరం పొడవునా విరివిగా, అందరికీ అందుబాటు ధరలో లభిస్తుంది.
అయితే అరటిపండు, ఆపిల్ రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిదో అనే విషయానికి వస్తే. ఆపిల్ లో ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన జీర్ణ సంబంద సమస్యలు గ్యాస్, కడుపు ఉబ్బరం, మలబద్దకం వంటి సమస్యలు లేకుండా చేయటమే కాకుండా కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండి తొందరగా ఆకలి వేయదు.
దాంతో బరువు తగ్గటానికి కూడా సహాయపడుతుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా ప్రోత్సహిస్తుంది. ఆపిల్ లో ఉండే పోషకాలు శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. ఇక అరటిపండు విషయానికి వస్తే.ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన పేగులకు మేలు చేసే బ్యాక్టీరియాలను ప్రోత్సహించి బ్యాక్టీరియా సంఖ్యను పెంచుతుంది.
అలాగే అరటిపండు తింటే కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచి తొందరగా ఆకలి వేయకుండా చేస్తుంది. అరటిపండులో పొటాషియం, మాంగనీస్, మెగ్నీషియం సమృద్దిగా ఉండుట వలన రక్తపోటుnu నియంత్రణలో ఉంచి గుండె ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. అరటిపండు కంటే ఆపిల్ లో ఫైబర్ సమృద్దిగా ఉంటుంది.
అందువల్ల అధిక బరువు ఉన్నవారు, డయాబెటిస్ ఉన్నవారు అరటిపండుతో పోలిస్తే ఆపిల్ తింటే మంచిది. ఎందుకంటే ఆపిల్ లో తక్కువ గ్లైసెమిక్ సూచిక ఉంటుంది. అలాగే అరటిపండులో ప్రోటీన్ సమృద్దిగా ఉంటుంది. అయితే రెండూ కూడా ఆరోగ్యకరమైనవి. కాబట్టి లిమిట్ గా తిని ఆరోగ్య ప్రయోజనాలను పొందండి.
0 Comments:
Post a Comment