ఆరోగ్యం ఆధారపడి ఉండేది ముఖ్యంగా మూడు విషయాల మీద ఒకటి భోజనం, రెండోది విశ్రాంతి, మూడోది వ్యాయామం. ఈ మూడు అంశాలు సరిగ్గా ఉంటే పెద్దగా వేధించే అనారోగ్యాలు తక్కువ.
చురుగ్గా ఉండేందుకు కేవలం తినే భోజనం మాత్రమే కాదు, తిన్న తర్వాత చేసే పనుల మీద కూడా శ్రద్ధ పెట్టాలని ఆయుర్వేదం చెబుతోంది. మనదేశానికి చెందిన పురాతనమైన శతపవ్లి అనే ఒక కాన్సెప్ట్ ఉంది.
దీని ప్రకారం భోంచేశాక షికారుకు వెళ్లమని చెబుతున్నారు. అలాగే భోజనం తర్వాత 100 అడుగులు నడవాలనే సూచన కూడా ఉంది. దీనిని షట్పావళి అంటారు. నితికా కోహ్లీ అనే ఆయుర్వేద డాక్టర్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా దీనిపై పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
పూర్వకాలం నుంచి జీర్ణక్రియకు తోడ్పడే మంచి అలవాటుగా షట్పావళి రుజువైంది. భోజనం చేసిన తర్వాత 100 అడుగుల దూరం నడవడం జీర్ణవ్యవస్థకు చక్కని అలవాటుగా పరిణమిస్తుందని నితికా కోహ్లీ అంటున్నారు.
వాకింగ్ లేదా జాగింగ్ శరీరాన్ని ఫిట్ గా ఉంచే మంచి వ్యాయామంగా నిపుణులు చెబుతున్నారు. కేవలం ఫిట్ గా ఉండడం బరువు అదుపులో పెట్టుకోవడం మాత్రమే కాదు ఇది జీర్ణవ్యవస్థను కూడా క్రమశిక్షణలో ఉంచుతుంది.
భోజనం తర్వాత వంద అడుగులు నడవడం వల్ల కలిగే లాభాల గురించి మరో ఆయుర్వేద నిపుణులు డాక్టర్ శ్రీవాస్తవ వివరించారు
జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది.
భోజనం తర్వాత నడిస్తే ఎక్కువ కాలరీలను బర్న్ చెయ్యడం సాధ్యమవుతుంది.
రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.
ట్రైగ్లిజరాయిడ్ల నియంత్రణకు తోడ్పడుతుంది.
తీసుకున్న ఆహారంలోని పోషకాలు కూడా త్వరగా శరీరానికి అందుతాయి.
డయాబెటిస్‌తో బాధపడుతున్నవారు భోజనం తర్వాత చిన్నగా నడిస్తే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉన్నట్టు స్పోర్ట్స్ మెడిసిన్ అనే జర్నల్ లో పేర్కొన్నారు. ఆయుర్వేదంలో సూచించిన ఈ పురాతన చిట్కా శట్పావళి చాలా ప్రయోజనకర ప్రక్రియ.
భోజనం తర్వాత నిద్రపోయే అలవాటు ఉంటుంది చాలా మందిలో. అది శరీరంలో కఫం, కొవ్వు పెరగడానికి కారణం అవుతుంది.
అంతేకాదు జీర్ణక్రియ కూడా నెమ్మదిస్తుంది. భోజనం తర్వాత వెంటనే నీళ్లు తాగడం కూడా జర్ణక్రియ నెమ్మదించడానికి కారణం కావచ్చని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. అంతేకాదు ఈ అలవాటు బరువు పెరగడానికి కూడా కారణం అవుతుందట.
భోజన సమయంలో లేదా భోజనం తర్వాత వెంటనే నీళ్లు తాగకూడదు. రెండు భోజనాల విరామ సమయంలోనే నీళ్లు తాగడం మంచిదనేది నిపుణుల సూచన.
0 Comments:
Post a Comment