ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్నది యుద్ధాలో, అణుబాంబులో, వైరసులో కాదు. ప్లాస్టిక్ భూతం. అవును ఓ 10-15 సంవత్సరాల నుంచి ప్లాస్టిక్ వినియోగం క్రమంగా పెరుగుతూ వస్తోంది.
గాలి, నీరు, ఆహారం.. ఆఖరికి తల్లి పాలను కూడా వదలడం లేదు ఈ భూతం. కొన్ని రోజల క్రితమే శాస్త్రవేత్తలు.. తల్లిపాలలో కూడా ప్లాస్టిక్ వ్యర్థాలున్నట్లు గుర్తించారు. పరిష్కారం లేని సమస్యగా తయారయ్యింది. నివారణ ఒక్కటే మార్గం.
ఎందుకంటే ఇది భూమిలో కరగదు.. కాలిస్తే.. వాతావరణంలోకి మరింత ప్రమాదకర వాయువులు విడుదలయ్యి.. వాయు కాలుష్యం పెరుగుతుంది.
కొన్నేళ్లుగా ప్లాస్టిక్ వల్ల ప్రపంచానికి ఎంతటి హానీ కలగనుందో.. శాస్త్రవేత్తలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దాంతో ఇప్పటికే చాలా దేశాల్లో ప్లాస్టిక్ వాడకంపై నిషేధం విధించారు. మన దేశంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ని బ్యాన్ చేశారు.
ఇక ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇప్పటికే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మీద నిషేధం విధించారు. అంతేకాక.. నిబంధనలు ఉల్లంఘించిన వారికి ఫైన్ కూడా వేస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఓ సరికొత్త నిర్ణయంతో మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవబోతుంది.
ఓవైపు ప్లాస్టిక్‌పై నిషేధాన్ని కొనసాగిస్తూనే.. మరోవైపు ఇప్పటికే వినియోగంలో ఉన్న ప్లాస్టిక్‌ను అర్థవంతంగా వినియోగించే దిశంగా ప్రయత్నాలు చేస్తోంది.
దానిలో భాగంగా.. ఏపీలో ప్లాస్టిక్ రోడ్ల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆ దిశగా ప్రయత్నాలు కూడా ప్రారంభం అయ్యాయి.
ప్రభుత్వం ప్టాస్టిక్ రోడ్ల నిర్మాణం చేపట్టాలని భావించండతో.. సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన పలువురు ప్రొఫెసర్‌లు తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించారు.
ఈ తరహా ప్లాస్టిక్ రోడ్ల నిర్మాణం వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుందని సీఆర్‌ఆర్‌ఐ నిపుణులు అభిప్రాయపడ్డారు. ప్లాస్టిక్ రోడ్ల వల్ల కొన్ని వందల కోట్ల రూపాయలు ఆదా అవ్వడమే కాక.. పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుందని.. ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించడానికి ఇదే సరైన ప్రత్యమ్నాయం అని చాలా దేశాలు భావిస్తున్నాయి.
రీసైక్లింగ్ చేయడానికి కుదరని ప్లాస్టిక్‌ను రోడ్ల నిర్మాణంలో వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
0 Comments:
Post a Comment