AP-TS Postal Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APలో 3వేలు, TSలో 2వేలకు పైగా ఉద్యోగాలు..
ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా...
కేంద్రం నుంచి కూడా పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల అవుతున్నాయి. ఇప్పుడు విడుదల అవుతున్న నోటిఫికేషన్లకు పరీక్షలు 2023 జనవరి నుంచి వరుసగా ప్రారంభం కానున్నాయి.
ఇప్పటికే తెలంగాణలో టీఎస్పీఎస్సీ నుంచి.. ఏపీలో ఏపీపీఎస్సీ నుంచి పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. వీటిలో రాష్ట్రాల్లో ఉన్నత పోస్టులైన గ్రూప్ 1 పోస్టులు కూడా ఉన్నాయి.
ఇక కేంద్రం నుంచి ఎక్కువగా రైల్వే డిపార్ట్ మెంట్ లో ఉద్యోగ ఖాళీలు ఎక్కువగా ఉన్నాయి. సికింద్రాబాద్ రైల్వే కేంద్రంలో దాదాపు 17వేలకు పైగా ఖాళీలు ఉన్నట్లు ఇటీవల పార్లమెంట్ లో మంత్రి ప్రకటించారు. వీటితో పాటు.. పోస్టల్ డిపార్ట్ మెంట్ లో కూడా పలు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో దాదాపు అన్ని పోస్టల్ రీజియన్ల నుంచి దాదాపు లక్షకు పైగా ఖాళీలున్నాయి.
వీటిలో దానిలో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు.. దేశవ్యాప్తంగా ఉన్న 23 సర్కిళ్లలో ఖాళీ పోస్టులను మంజూరు చేస్తున్నట్లు ఇటీవల ఓ నోటీస్ ను విడుదల చేశారు. దానిలో భాగంగా.. ఇండియా పోస్ట్ (Dak Vibhag Vacancy 2022)ద్వారా ప్రస్తుతం జరుగుతున్న రిక్య్రూట్ మెంట్ ప్రాసెస్ అయిన వెంటనే నోటిఫికేషన్లను జారీ చేయనుంది.
దీనికి సంబంధించిన పూర్తి వివరాలను వెబ్‌సైట్‌లో indiapost.gov.in లో తెలుసుకోవచ్చు. పోస్టల్ డిపార్ట్‌మెంట్ మొత్తం లక్షకు పైగా ఉద్యోగాలను భర్తీ చేయనుంది. వీటికి సంబంధించి 23 పోస్టల్ సర్కిళ్ల వారీగా పోస్టులను మంజూరు చేసింది.
మంజూరు చేసిన పోస్టుల వివరాల్లోకి వెళ్తే.. దేశంలో ఉన్న 23 సర్కిల్స్ నుంచి శాంక్షన్డ్ పోస్టులకు సంబంధించిన వివరాలను అధికారులు విడుదల చేసిన నోటీస్ లో పేర్కొన్నారు.
మెయిల్ మోటార్ సర్వీసెస్, పోస్టల్ సర్వీసెస్ గ్రూప్ బీ పోస్టులు, అసిస్టెంట్ సూరింటెండెంట్ పోస్టులు, మెయిల్ మోటార్ సర్వీస్, ఇన్ స్పెక్టర్ మరియు పోస్టల్ ఆపరేటివ్ సైడ్ కు సంబంధించిన పోస్టులు ఉన్నాయి.
అంతే కాకుండా.. రైల్వే మెయిల్ సర్వీసెస్ కింద సేవింగ్ బ్యాంక్ కంట్రోల్ ఆర్గనైజేషన్, రీజినల్ ఆఫీస్ లకు సంబంధించి పోస్టులు, పోస్ట్ మ్యాన్, మెయిల్ గార్డ్, స్టెనోగ్రాఫర్ , మల్టీ టాస్కింగ్ స్టాప్ వంటి కింది క్యాడర్ పోస్టులకు ఎన్ని పోస్టులను మంజూరు చేస్తున్నది నోటీస్ లో పేర్కొన్నారు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన భారత విద్యా సంస్థ నుంచి 10వ తరగతి ఉత్తీర్ణత సర్టిఫికేట్ కలిగి ఉండాలి. అంతేకాకుండా అభ్యర్థులు కంప్యూటర్ పరిజ్ఞానం కూడా కలిగి ఉండాలి.
మరికొన్ని పోస్టులకు ఇంటర్ పూర్తి చేసి ఉండాలి. ఈ పోస్టులకు అప్లై చేసుకునే వారి కనీస వయసు 18 సంవత్సరాలు, గరిష్ట వయసు 32 సంవత్సరాలు ఉండాలని భారత్ పోస్టల్ డిపార్ట్‌మెంట్ పేర్కొంది. దేశ వ్యాప్తంగా ఉన్న 23 సర్కిల్స్ లల్లో ఖాళీలను గుర్తించారు.
అందులో పోస్ట్ మ్యాన్, మెయిల్ గార్డ్, ఎంటీఎస్ ఖాళీల విషయానికి వస్తే.. 59,099పోస్టులు పోస్ట్ మ్యాన్, 1445 మెయిల్ గార్డ్, 37,539 మల్టీ టాస్కింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించారు.
వీటితో పాటు స్టెనోగ్రాఫర్ కు సంబంధించి పోస్టులను కూడా ఆయా సర్కిళ్ల వారీగా మంజూరు చేశారు. దీనిలో ఆంధ్రప్రదేశ్ కు పోస్ట్ మెన్ పోస్టులు 2289, మెయిల్ గార్డ్ 108 మరియు ఎంటీఎస్ పోస్టులు 1166 పోస్టులను మంజూరు చేశారు.
అదేవిధంగా తెలంగాణ సర్కిల్ కింద పోస్ట్ మెన్ 1553, మెయిల్ గార్డ్ 82, ఎంటీఎస్ 878 పోస్టులను మంజూరు చేశారు. వచ్చే సంవత్సరం జనవరిలో దీనికి సంబంధించి నోటిఫికేషన్స్ వెలువడే అవకాశం ఉంది. పూర్తి వివరాలకు https://www.indiapost.gov.in/ వెబ్ సైట్ సందర్శించడం ద్వారా తెలుసుకోవచ్చు.
0 Comments:
Post a Comment