జనవరి 1 నుంచి ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ ఈ-ఆఫీసులోనే
ప్రభుత్వ కార్యాలయాల మధ్య దస్త్రాలు,ప్రతిపాదనలు, ఉత్తర ప్రత్యుత్తరాలను ఇకపై విధిగా ఈ-ఆఫీసు ద్వారానే నిర్వహించాలని స్పష్టం చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్‌రెడ్డి శుక్రవారం ఉత్తర్వులిచ్చారు.జనవరి ఒకటి నుంచి సంప్రదాయ విధానంలో కాగితాల ద్వారా (ఫిజికల్ ఫార్మాట్) దస్త్రాల్ని పంపడం,ఉత్తర ప్రత్యుత్తరాలు జరపడాన్ని అనుమతించబోమని స్పష్టం చేశారు.‘రాష్ట్ర ప్రభుత్వం ఈ-ఆఫీసును ప్రవేశపెట్టి ఆరేళ్లయినా చాలా ప్రభుత్వ విభాగాలు ఉత్తర ప్రత్యుత్తరాలను కాగితాల ద్వారానే నిర్వహిస్తున్నాయి.ఏసీబీ సహా వివిధ విభాగాధిపతులు అందజేసిన ప్రతిపాదనలు,నివేదికలు కనిపించకుండా పోతున్నాయి.ఈ-డిస్పాచ్,ఈ-తపాల్ ద్వారానే ఉత్తర ప్రత్యుత్తరాలు జరగాలి ’అని పేర్కొన్నారు.ఈ విధానం అమలుకు మార్గదర్శకాలను విడుదల చేశారు.‘ఇకపై ఒక విభాగం నుంచి ఇతర కార్యాలయాలు, విభాగాలకు వెళ్లాల్సిన ప్రతిపాదనలపై సంబంధిత అధీకృత అధికారి డిజిటల్ సంతకం ఉండాలి.దాన్ని ఈ-డిస్పాచ్ విధానంలోనే పంపించాలి.ప్రభుత్వ జీవోలకు సంబంధించి ప్రస్తుతం ఉన్న విధానాన్నే అనుసరించాలి.ఏసీబీ, విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాలు తమ నివేదికలను ఏపీ విజిలెన్స్ కమిషన్‌కి, సంబంధిత శాఖ కార్యదర్శికి డిజిటల్ ఫార్మాట్‌లోనే పంపించాలి...’ అని స్పష్టం చేశారు.
0 Comments:
Post a Comment