Aloe Vera And Coconut Oil : ప్రస్తుత తరుణంలో చాలా మంది జుట్టు రాలే సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. ఉన్న జుట్టు మొత్తూ పోడిపోతుందని దిగులు చెందుతున్నారు.
ఇక పురుషులు అయితే జుట్టు రాలుతుందంటే చాలు.. బట్టతల అవుతుందేమోనని కంగారు పడుతుంటారు. ఇందుకు గాను వారు అనేక మార్గాలను అనుసరిస్తుంటారు.
అయితే జుట్టు రాలే సమస్యను వెంటనే ఆపేయడంతోపాటు కేవలం వారం రోజుల్లోనే జుట్టు పెరుగుదలను ప్రోత్సహించే చిట్కా ఒకటుంది. అందుకు గాను మనం కేవలం అలొవెరా (కలబంద), కొబ్బరినూనెను ఉపయోగించాల్సి ఉంటుంది.
వారంలో కనీసం 3 రోజుల పాటు ఇలా చేయాలి. అంటే రోజు మార్చి రోజు ఈ చిట్కాను పాటించాల్సి ఉంటుంది. దీన్ని ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కలబంద గుజ్జును ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుని దానికి అంతే మోతాదులో కొబ్బరినూనెను కలపాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపిన తరువాత జుట్టుకు రాయాలి. జుట్టు కుదుళ్లకు తగిలేలా ఈ మిశ్రమాన్ని రాయాల్సి ఉంటుంది. అనంతరం జుట్టుకు ఏదైనా టవల్‌ను చుట్టాలి.
రాత్రంతా దాన్ని అలాగే ఉంచాలి. మరుసటి ఉదయం తలస్నానం చేయాలి. ఇలా వారంలో 3 సార్లు చేయాలి. దీంతో జుట్టు రాలడం వెంటనే తగ్గుతుంది. జుట్టు పెరగడం మొదలవుతుంది.
Aloe Vera And Coconut Oil
కొబ్బరినూనె, కలబంద గుజ్జు జుట్టు సమస్యలకు ఎంతగానో ఉపయోగపడతాయి. కనుకనే ఈ మిశ్రమం బాగా పనిచేస్తుంది. జుట్టు రాలే సమస్య ఉన్నవారు దీన్ని వాడడం వల్ల తప్పక ఫలితం పొందవచ్చు.
ఈ రెండూ సహజసిద్ధమైన పదార్థాలు. అలాగే కలబంద గుజ్జు జుట్టును శుభ్రం చేసి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. కొబ్బరినూనె జుట్టుకు కావల్సిన పోషకాలను అందిస్తుంది.
దీంతో జుట్టు పెరుగుతుంది. ఈ మిశ్రమాన్ని తరచూ వాడడం వల్ల జుట్టు అసలు రాలదు. జుట్టు వద్దన్నా పెరుగుతూనే ఉంటుంది. దీన్ని ఎవరైనా సరే ఒకసారి ట్రై చేయవచ్చు.
0 Comments:
Post a Comment