Alexa : అలెక్సా... నా ఫోన్ ఎక్కడుంది?
అలెక్స వెంటనే చెప్పేస్తుంది....
ఇంటిని అందంగా అమర్చుకోవడం అంతకుమించి ప్రతి వస్తువుకు ఒక ప్రదేశాన్ని కేటాయించుకోవడం వరకు ఓకే. అలాగే లైట్లు వెలిగించడం నుంచి గ్రీజర్ షెడ్యూలింగ్ వరకు రిమోట్ ఆపరేటింగ్ కూడా ఓకే.
అదే సమయంలో మిస్ అయిన మొబైల్ సంగతి ఏమిటి అన్నది ప్రశ్న. అనుకోకుండా ఎక్కడో పెట్టిన మొబైల్‌ని వెతికిపట్టుకోవడం నిజంగా సమస్య. దానికి కూడా అలెక్సాతో సులువుగా పరిష్కారం లభిస్తుంది.
అందుకోసం అలెక్సా కాలింగ్ ఫీచర్‌ను ఏర్పాటు చేసుకోవాలి. మొదట స్మార్ట్‌ఫోన్‌లో అలెక్సా యాప్‌ని ఓపెన్ చేసుకోవాలి. బాటమ్ మెనూలో ఉన్న కాన్వర్షేషన్ టాబ్‌ని టాప్ చేయాలి. అలెక్సా కోసం ఆన్‌స్ర్కీన్ ఆదేశాలను పాటించాలి. అలెక్సా ఎనేబుల్డ్ స్మార్ట్ స్పీకర్ లేదా ఫోన్‌ను కనుగొనేందుకు స్మార్ట్ డిస్‌ప్లే లేదా కాల్ యువర్ ఫోన్‌ని అడగాలి. ఎనేబుల్ అయి ఉంటే డివైస్‌కి అలెక్సా రింగ్ ఇస్తుంది. ఇంటిదగ్గర మొబైల్ ఉండి, అదే అకౌంట్‌కు అలెక్సా యాప్ ఇన్‌స్టాల్ అయి ఉంటే చాలు. అలెక్సా కాల్ మై ఫోన్, అలెక్సా ఫైండ్ మై ఫోన్, అలెక్సా రింగ్ మై ఫోన్ వంటి వాయిస్ కమాండ్స్ పెట్టుకోవచ్చు. పలు అకౌంట్స్ ఉంటే అలెక్సా వాయిస్ ప్రొఫైల్‌ను సెట్ చేసుకోవాలి. అప్పుడు అలెక్సా మీ వాయిస్‌ని గుర్తించి కరెక్ట్ స్మార్ట్‌ఫోన్‌కు రింగ్ పంపుతుంది. ఫోన్ సైలెంట్ మోడ్‌లో ఉండకూడదు. ఇంటర్నెట్‌తో కనెక్ట్ అయి ఉండాలి. అలాంటప్పుడు పోయినప్పటికీ పనిచేస్తుంది.
0 Comments:
Post a Comment